AP High court: జగన్ ప్రభుత్వానికి మరో పెద్ద ఎదురుదెబ్బ..! ఆ ఐఏఎస్ చట్రంలో ఇరుక్కున్న జగన్..!!

Share

AP High court: ఏపిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు ఇవ్వడం సాధారమైపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో దాదాపు 75 నుండి 80 శాతం వాటిని హైకోర్టు తప్పుబట్టడం, వ్యతిరేక తీర్పులు ఇవ్వడం అసాధారణం. కానీ ఆ అసాధారణ పరిస్థితులు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏర్పడ్డాయి. 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, కొద్ది రోజులకే హైకోర్టు లో ఒక వ్యతిరేక తీర్పు వచ్చింది. విద్యుత్ పీపీఏల సమీక్షకు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. అప్పటి నుండి మొదలు కొని అనేక కీలక అంశాలు అంటే రాజధాని వికేంద్రీకరణ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం, గ్రామ పంచాయతీ ఆఫీసులకు రంగులు వంటి వాటిపై వ్యతిరేక తీర్పులు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి ఒక తీర్పు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చింది. ప్రభుత్వం సమీక్ష చేసుకోకుండా తెలిసి తెలిసి ఎందుకు తప్పులు చేస్తుంది అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

AP High court another against verdict on ap govt
AP High court another against verdict on ap govt

AP High court: ఎయిడెడ్ పాఠశాలల గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆపవద్దు

దీనిలో కొందరు ఐఏఎస్ ల పాత్ర ఉంది. సీఎం జగన్మోహన రెడ్డిని కొందరు ఐఏఎస్ లు తప్పుదోవ పట్టిస్తున్నారు అన్న మాటలు వినబడుతున్నాయి. ఎయిడెడ్ పాఠశాలల విషయంలో హైకోర్టు ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులు ఏమిటంటే.. విల్లింగ్ ఇవ్వలేదని ఏ ఎయిడెడ్ పాఠశాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆపడానికి వీలులేదని ఆదేశాలు ఇచ్చింది. విల్లింగ్ ఇవ్వని ఎయిడెడ్ పాఠశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆపేస్తామని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితీ చాలా మంది ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఈ కేసు హైకోర్టు ఉన్నంత కాలం కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించాలని చెప్పింది. ఏ స్కూల్ పై చర్యలు తీసుకోవడానికి కూడా వీలులేదని ఉత్తర్వులో పేర్కొన్న హైకోర్టు… తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. దాదాపుగా 180 పిటిషన్ లు హైకోర్టులో ప్రభుత్వం పై పిటిషన్ లు దాఖలు అయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు పై విధంగా  మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

పదవ తరగతి పరీక్షల విషయంలోనూ..

రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గందరగోళానికి గురైంది. కరోనా సెకండ్ వేవ్ తో ప్రాణాలు పోతున్నా, కరోనా మహమ్మారికి దేశ వ్యాప్తంగా ప్రజలు వణికిపోతున్నా ఇదిగో పరీక్షలు పెట్టేస్తాం.. పెట్టేస్తాం అంటూ చెప్పుకుంటూ వచ్చి చివరకు రద్దు చేశారు. దీనిలో ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుంది. అదే మే నెలలోనే పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రకటించి ఉంటే అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన ఉండేది కాదు. పిల్లలు పొలిసెట్ లేదా ట్రిపుల్ ఐటి వంటి ఇతర పరీక్షలకు సన్నద్దం అయ్యేవారు. విద్యార్థులకు సమయం కలసి వచ్చేది. విద్యార్థులను మానసిక ఆందోళనకు గురి చేసి ప్రభుత్వం అప్రతిష్టను మూట గట్టుకుంది. పైగా ప్రతిపక్షాలకు మైలేజ్, క్రెడిట్ దక్కేలా చేసింది. తాజాగా ఎయిడెడ్ పాఠశాలల విషయంలో కూడా సరైన విధంగా నిర్ణయం తీసుకోలేదు. వీటిన్నింటికి కారణం కొందరు ఐఏఎస్ అధికారులు అనే మాట వినబడుతోంది.

AP High court: ఐఏఎస్‌ల సూచనలకే ప్రాధాన్యం

విద్యాశాఖ కమిషనర్ గా ఉన్న విద్యాసాగర్ వింత నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ప్రజా ప్రతినిధులకు, వైసీపీలోని పెద్దలకు తెలిసినా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నాయకులు చెప్పే విషయాల కంటే ఐఏఎస్ లు చెప్పే మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వారు వాపోతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఐఏఎస్ లు సీఎంకు తప్పుడు నిర్ణయాలు ఇస్తుండటం వల్లనే అటు కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తున్నాయనే మాట వినబడుతోంది. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ కోసం ప్రచారం కూడా చేసిన సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ఏబిఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో కొందరు ఐఏఎస్ లు సీఎం జగన్ ను తప్పుదోవపట్టిస్తున్నారనీ, అందుకే ఉన్నత విద్యా వ్యవస్థ దెబ్బతింటోందని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఈ విషయాలపై వాస్తవాలను సీఎం జగన్ తెలుసుకుంటారని ఆశిద్దాం.


Share

Related posts

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ టైం కన్నీరు పెట్టుకున్న షణ్ముఖ్..!!

sekhar

ఆదిత్యనాథ్ దాస్… ఓ కరుడుగట్టిన అధికారి ; జగన్ ది మంచి ఛాయిస్

Comrade CHE

జైలు నుంచి బ‌య‌ట‌కు రాగానే… అఖిల‌ప్రియ సంచ‌ల‌న నిర్ణ‌యం?

sridhar