24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ ..ఏపి సీఐడీ కేసు కొట్టివేత

Share

ఏపీ సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు పై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. గన్నవరం విమానాశ్రయంలో జరిగిన బంగారం స్మగ్లింగ్ కు సంబంధించిన వార్తను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశారన్న ఆరోపణతో ఏపీ సీఐడీ అధికారులు అంకబాబుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనను సెప్టెంబర్ 22వ తేదీన సీఐడీ అధికారులు అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చారు. అయితే 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని మెజిస్ట్రేట్ తప్పుబడుతూ సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించి బెయిల్ మంజూరు చేశారు.

 

కాగా ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆంకబాబు హైకోర్టుల క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ తప్పుడు కేసు నమోదు చేసిందని అంకబాబు తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకుని సీఐడీ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇస్రో గూఢచర్యం కేసు: మాజీ డీజీపీ సహా ఇతర నిందితుల ముందస్తు బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు


Share

Related posts

Shah Rukh Khan: సౌదీ అరేబియా వెళ్లి భక్తిలో మునిగి తేలుతున్న షారుఖ్ ఖాన్.. ఫొటోలు వైరల్..

Ram

Nani: వెనక్కి తగ్గిన నాచురల్ స్టార్ నాని..??

sekhar

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

somaraju sharma