NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి ప్రభుత్వానికి హైకోర్టు మరో ఎదురుదెబ్బ .. జీవో నెం.1ను రద్దు చేసిన హైకోర్టు

Share

ఏపి సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.1 ను హైకోర్టు కొట్టేసింది. రహదారులపైనా, కూడళ్లలోనూ సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిషేదిస్తూ ప్రభుత్వం జనవరి 2న జీవో తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ర్యాలీలు, సభలకు పోలీసుల అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని, వాటి వివరాలను పోలీసులకు ఇవ్వాలని జీవోలో పేర్కొంది ప్రభుత్వం. మార్కాపురం, గుంటూరులో చంద్రబాబు సభల్లో జరిగిన తొక్కిసలాటల్లో  పలువురు మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ జీవో తీసుకువచ్చింది. ప్రజాప్రయోజం కోసమే ఈ జీవో తీసుకువచ్చినట్లు ప్రభుత్వం సమర్ధించుకున్నది.

AP HIgh Court

 

ఈ ఏడాది జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.1ను తీసుకువచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదే జీవోను సవాల్ చేస్తూ మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర, ఏపి పీసీసీ అధ్యక్షుడు గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివారెడడి, ఏఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోలీస్ యాక్ట్ 30 కి భిన్నంగా ఈ జీవో ఉందని పిటిషనర్ల తరుపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు.

రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందనీ, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఈ జీవో ను తీసుకువచ్చారని కోర్టుకు తెలిపారు. ప్రతిపక్షాలు రోడ్డుపై నిర్వహించే కార్యక్రమాలను జీవో నెంబర్ 1 పేరుతో అడ్డుకునే ప్రమాదం ఉందని, అందువల్ల ఈ జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్లపై జనవరి 24న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవిఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మానం విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. ఈ జీవో ప్రాధమిక హక్కులను విఘాతం కలిగించేలా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ జీవోను కొట్టేస్తూ ఇవేళ తీర్పు వెలువరించింది.


Share

Related posts

BREAKING: సుప్రీం కోర్ట్ జడ్జిగా తెలంగాణ హైకోర్టు సీజే హిమా కోహ్లీ..!

amrutha

Mangli : ఎంత సేపు ఆ నర్సపల్లి, నర్సపురం పాటలేనా? సింగర్ మంగ్లీని స్టేజ్ మీదనే అనేసిన యాంకర్ సుమ?

Varun G

Periods నెలసరి సమయంలో నొప్పితో బాధపడుతుంటే ఇలా చేసిచూడండి!!

Kumar