NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఉపసంహరణ కేసులపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

AP High Court: రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులపై ఎన్ని కేసులు ఎత్తివేశారు, వాటిలో ఎన్ని కేసులకు హైకోర్టు అనుమతి తీసుకున్నారో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపి సర్కార్ కు హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పై నమైదు అయిన పది కేసులను ఎత్తివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ చెవులు కృష్ణాంజనేయులు తరపున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. పీపీతో సంబంధం లేకుండా డీజీపీ, కలెక్టర్ ఆదేశాలతో కేసులు ఎలా తొలగిస్తారని న్యాయవాది ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేసులు తొలగించాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని న్యాయవాది శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. హైకోర్టు అనుమతి లేకుండా కేసులను ఉపసంహరిస్తే అది కోర్టు దిక్కారం కిందకు వస్తుందని అన్నారు.

AP High Court hearing on dismissal of cases against mla udayabhanu
AP High Court hearing on dismissal of cases against mla udayabhanu

కేసులు ఎత్తివేసేటప్పుడు హైకోర్టు అనుమతి తీసుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ప్రభుత్వ న్యాయవాది అనుమతి తీసుకోలేదని తెలిపారు. దీంతో హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా ఎత్తివేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజా ప్రతినిధులపై మొత్తం ఎన్ని కేసులు తొలగించారు. వాటిలో ఎన్ని కేసులకు హైకోర్టు అనుమతి తీసుకున్నారో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ .. తదుపరి విచారణను వాయిదా వేసింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju