Subscribe for notification

AP High Court: ఆ కేసులో టీడీపీ మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో రిలీఫ్

Share

AP High Court: టీడీపీ మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో రిలీఫ్ లభించింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఏపీ సీఐడి నమోదు చేసిన కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇంటీరియమ్ ఆర్డర్స్ ఇచ్చింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని ఏపీ సీఐడీకి పిర్యాదు చేసిన నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ సహా మరి కొందరు వ్యక్తులు, సంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తొంది. దీంతో నారాయణతో పాటు లింగమనేని బ్రదర్స్, రామకృష్ణ నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు .. పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది.

AP High Court interim order on inner ring road case

మాజీ మంత్రి నారాయణపై ఒక పక్క టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీ కేసు, మరో పక్క ఇన్నర్ రింగ్ కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. రాజకీయ కక్షతో నారాయణపై కేసులు నమోదు చేశారని టీడీపీ ఆరోపిస్తుండగా. అధికార పక్షం సమర్ధిస్తూ వారి వాదనను వెల్లడిస్తొంది. పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణకు చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేయగా, నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై చిత్తూరు కోర్టు లో విచారణ జరుగుతోంది. అటు టెన్త్ పరీక్షా పత్రాల కేసులో బెయిల్ లభించడం, ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తొందర పాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడం నారాయణకు రిలీఫ్ లభించినట్లు అయ్యింది.


Share
somaraju sharma

Recent Posts

Ravi Teja: ఆ సినిమా ఔట్‌పుట్‌పై రవితేజ తీవ్ర నిరాశ.. ప్రమోషన్లకు రానని!

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…

33 mins ago

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

1 hour ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

3 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

5 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

7 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

8 hours ago