NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఎంపీ రఘురామ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ..ఏపీ సీఐడీ విచారించవచ్చు కానీ..

AP High Court: వైసీపీ ఎంపి రఘురామ కృష్ణంరాజుపై ఏపీ సీఐడి నమోదు చేసిన కేసులో రాజద్రోహం (సెక్షన్ 124ఏ) మినహా ఇతర సెక్షన్‌ల విషయంలో దర్యాప్తు కొనసాగించుకోవచ్చనీ, దర్యాప్తునకు రఘురామ కృష్ణంరాజు సహకరించాల్సిందేననీ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే విచారణ పేరుతో పిలిచి సీఐడీ హాని తలపెట్టే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని దిల్‌కుషా ప్రభుత్వ అతిధి గృహంలో ఆయనను విచారించేందుకు సీఐడీకి అనుమతి ఇచ్చింది హైకోర్టు. పిటిషనర్ ఎంచుకున్న న్యాయవాది సమక్షంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలనీ, విచారణ ప్రక్రియను వీడియో గ్రఫీ చేయాలనీ తెలిపింది.

AP High Court interim order on MP Raghurama CID Case
AP High Court interim order on MP Raghurama CID Case

 

పిటిషనర్ హార్ట్ పేషంట్ అయినందున దర్యాప్తు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఆయన భద్రతా సిబ్బందిని విచారణ చేసే గది బయట వరకూ అనుమతించాలని దర్యాప్తు అధికారులకు ఆదేశించింది. కేసుకు సంబంధించిన అంశాలు తప్ప ఇతర విషయాల గురించి ప్రశ్నించడానికి వీల్లేదని చెప్పింది. పిటిషనర్ ఎఫ్ఐఆర్ నమోదునే సవాల్ చేసినందన ఈ కేసు దర్యాప్తు ముగిసినప్పటికీ చార్జిషీటు దాఖలు చేయవద్దని దర్యాప్తు అధికారులను ఆదేశించింది. ఈ కేసులో ఏబీఎన్, టీవీ 5 యాజమాన్యం కూడా నిందితులుగా ఉన్నారు.

 

కేసు దర్యాప్తు లో భాగంగా ఇతర నిందితులతో కలిపి రఘురామ కృష్ణంరాజును ప్రశ్నించాలని సీఐడీ భావిస్తే కనీసం 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలని తెలిపింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామనీ, సంబంధిత అధికారులు చట్టపరంగా చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఆగస్టు 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం మథ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N