AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ ..ఆ ఉత్తర్వులపై స్టే

Share

AP High Court: ఏపి సర్కార్ (AP Govt) కు హైకోర్టులో మరో షాక్ తగిలింది. సినిమా (Cinema) టెకెట్ల ఆన్ లైన్  ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదనంతర చర్యలన్నింటినీ ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్ లో విక్రయించేందుకు వీలుగా 2021 డిసెంబర్ 15న తీసుకువచ్చిన సవరణ చట్టాన్ని, టికెట్ల విక్రయ ఫ్లాట్ ఫామ్ నిర్వహణను ఏపి స్టేట్, ఫిల్మ్ టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (ఏపిఎస్ఎఫ్‌టీవీటిడిసీ) అప్పగిస్తూ డిసెంబర్ 17న జారీ చేసిన జీవో ను సవాల్ చేస్తూ బుక్ మై షో (Book My Show) సంస్థ, మల్టీప్లెక్స్ (Multiplex)అసోసియేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్ లైన్ వేదిక ద్వారా మాత్రమే ప్రైవేటు సంస్థలను టికెట్ల ను విక్రయించాలని ఒత్తిడి చేయడంపై ప్రధానంగా అభ్యంతరం తెలిపారు.

AP High Court interim order on online cinema ticket issue

 

పిటిషనర్ల తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, న్యాయవాదులు అశ్వనీకుమార్, సీవీ మోహన్ రెడ్డిలు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరుపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ భాగస్వాములందరితో చర్చించి ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చిందనీ, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ఈ నెల 2వ తేదీ నుండి ఏపిలోని థియేటర్ లు అన్నీ ఆన్ లైన్ ద్వారానే టికెట్లు విక్రయించేలా ఒప్పందాలు చేసుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పిటిషన్ల పై ఇరుపక్షాల వాదనలు బుధవారం ముగిశాయి, ప్రధాన వ్యాజ్యాలపై జూలై 27న తుది విచారణ చేస్తామని పేర్కొన్న ధర్మాసనం.. జూలై 1న దీనిపై తగిన ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ డివీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సదరు జివోపై స్టే విధిస్తూ తదనంతర చర్యలు అన్నింటినీ ఆపేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

15 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

24 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago