NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court : హైకోర్టులో ఎస్ఈసీకి మరో సారి షాక్ … మంత్రి కొడాలి నానికి ఊరట

AP High Court : ఏపి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని kodali nani హైకోర్టులో ఊరట లభించింది. మీడియాతో మంత్రి కొడాలి నాని మాట్లాడవచ్చని హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకూ మీడియాతో మంత్రి   కొడాలి నాని మాట్లాడకూడదంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆంక్షలను  హైకోర్టు ఎత్తివేసింది. అయితే ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగే విధంగా కొడాలి నాని మాట్లాడకూడదని హైకోర్టు సూచించింది. మీడియాతో మాట్లాడే సమయంలో సంయమనం పాటించాలని పేర్కొంది.

AP High Court interim orders on kodali Nani petition
AP High Court interim orders on kodali Nani petition

ఎస్ఈసీ ఇంతకు ముందు మంత్రి పెద్దిరెడ్డి రామంద్రారెడ్డి, పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విషయంలో తీరుకున్న చర్యలను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మంత్రి కొడాలి నాని విషయంలో తీసుకున్న చర్యలపైనా ఎస్ఈసీకి హైకోర్టు షక్ ఇచ్చింది.

AP High Court interim orders on kodali Nani petition
AP High Court interim orders on kodali Nani petition

ఇటీవల మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై న్యాయవాది ద్వారా ఎస్ఈసీకి మంత్రి నాని వివరణ ఇచ్చారు. అయితే వివరణపై సంతృప్తి చెందని ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకూ (ఈ నెల 21వ తేదీ) మీడియాతో మాట్లాడకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఈసీ ఉత్తర్వులపై మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపింది. ఇరుపక్షాల న్యాయవాదులు సమర్పించిన మంత్రి మీడియా సమావేశం వీడియోలను హైకోర్టు పరిశీలించింది. నిన్న విచారణ సందర్భంలో పిటిషన్ పై మధ్యేమార్గంగా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N