AP High Court: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి లో గ్రానైట్ తవ్వకాలపై ఏపీ హైకోర్టు స్టేషన్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ.. మంత్రి విడతల రజిని, ఎంపి అవినాష్ బందువులు ప్రతాప్ రెడ్డి, శ్వేతారెడ్డి, జీవీ దినేష్ రెడ్డి, శివపార్వతిలకు నోటీసులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డీకే పట్టాలు రద్దు చేయకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్ఓసీ ఇవ్వడంపై హైకోర్టులో కొందరు రైతులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.

మొత్తం 21 ఎకరాల 50 సెంట్ల భూమిలో గ్రానైట్ తవ్వకాలకు ఎన్ఓసీ ఇచ్చిన తహశీల్దార్ కు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా రైతులు పనులు చేస్తుంటే అడ్డుకున్న ఎస్‌ఐకి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రైతులకు తెలియకుండా ఎన్ఓసీ ఇవ్వడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. ఈ కేసు విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం .. అప్పటి వరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. కౌంటర్ లు దాఖలు చేయాలని మంత్రి రజిని, ఇతరులను ఆదేశించింది.
మురరికపూడి గ్రామ పరిధిలోని వివిధ సర్వే నెంబర్ లో గతంల తమకు ఇచ్చిన భూముల్లో గ్రానైట్ తవ్వకాలకు లీజులు ఇచ్చేందుకు అధికారులు సిద్దమవుతున్నారని 65 మంది హైకోర్టును ఆశ్రయించారు. 2007 – 2008 సంవత్సరంలో 90 ఎకరాల్లో తమకు అసైన్డ్ భూముల పట్టాలు ఇచ్చారని పిటిషన్ లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు హైకోర్టుకు నివేదించారు. బీ ఫాం పట్టా పొందిన తర్వాత పిటిషనర్లు అందరూ ఆ భూములను సాగు చేసుకుంటున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది వీవీ లక్ష్మినారాయణ గత ఏడాది డిసెంబర్ 27న వాదనలు వినిపించారు.
కీలక నిర్ణయాన్ని ప్రకటించిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి