NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఆనందయ్య కరోనా మందుపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!

AP High Court: కరోనా సెకండ్ వేవ్ సమయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య (Anandaiah) కరోనా మందు ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆనందయ్య నాటు మందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం (AP Govt).. ఆయన తయారు చేసిన కంటి చుక్కల మందు (Eye Drops) పంపిణీకి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఆనందయ్య హైకోర్టు (AP High court)లో పిటిషన్ దాఖలు చేయగా నేడు విచారణ జరిపింది. తాను తయారు చేసిన కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆనందయ్య తెలియజేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకున్నట్లు పిటిషన్ లో వివరించారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికరంగా వాదోపవాదాలు జరిగాయి.

AP High Court key orders on anandaiah medicine
AP High Court key orders on anandaiah medicine

AP High Court: ఆసక్తికరంగా వాదనలు

ఆనందయ్య అసలు ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేయగా, దీనిపై ఆనందయ్య తరపు న్యాయవాది ప్రభుత్వ న్యాయవాది వాదనను ఖండించారు. ప్రభుత్వానికి ఆనందయ్య చేసుకున్న ధరఖాస్తును, అందుకు ప్రభుత్వం వెల్లడించిన స్పందనను కోర్టుకు సమర్పించారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాది తన వాదనలను కొనసాగిస్తూ ఆనందయ్య కంటి చుక్కల మందు ప్రమాదకరమని వెల్లడించారు. దీనిపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆనందయ్య మందు కారణంగా ఎందరు చనిపోయారు. కరోనా వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎందరు చనిపోయారు అంటూ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. అంతే కాకుండా ఆనందయ్య ధరఖాస్తును ప్రభుత్వం వెంటనే పరిశీలించాలనీ, సాంకేతిక కారణాలు సాకుగా చూపి ధరఖాస్తును తిరస్కరించవద్దని పేర్కొంది.

హైకోర్టు జోక్యంతో ఆనందయ్య మందుకు అనుమతి

కరోనా సెకండ్ వేవ్ సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం ఆనందయ్య కరోనా మందు కోసం పెద్ద సంఖ్యలో కృష్ణపట్నం బాటపట్టారు. వందలాది మందికి ఆనందయ్య మందు పంపిణీ చేశారు. అయితే లోకాయుక్త ఆదేశాలు అంటూ ఆనందయ్య మందు పంపిణీని ప్రభుత్వ అధికారులు అడ్డుకోవడంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ప్రభుత్వం ఆనందయ్య మందుపై అధ్యయనానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆయుష్, ఐసీఎంఆర్ నిపుణుల బృందం ఆనందయ్య మందుపై పరిశోధనలు జరిపింది. ఆ నేపథ్యంలో ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వం ఆయన మందు పంపిణీకి అనుమతి ఇచ్చింది. అయితే కంటి చుక్కల మందుకు మాత్రం ఇంత వరకూ అనుమతి ఇవ్వలేదు. ఈ తరుణంలో మరో సారి ఆనందయ్య హైకోర్టు ను ఆశ్రయించగా నేడు కీలక ఆదేశాలు ఇచ్చింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?