NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: రాజధాని అమరావతి కేసులో హైకోర్టు కీలక తీర్పు..రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్..

AP High Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్ లపై  హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశించింది. అదే విధంగా అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

 AP High Court key verdict on Amaravati capital petitions
AP High Court key verdict on Amaravati capital petitions

AP High Court: మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలి

భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచి ప్లాట్లను అప్పగించాలని, రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా వాటిని ఆ భూములను తనఖా పెట్టడానికి కూడా వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలనీ, మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని పేర్కొంది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని చెప్పింది. అమరావతి నుండి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదనీ, పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేల వంతున చెల్లించాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే..

రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన సీఆర్డీఏ రద్దు చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ చట్టాలను సవాల్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులతో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ లపై విచారణ కొనసాగుతుండగానే ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసినందున ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లు అన్నీ నిరర్ధకం అవుతాయనీ, వాటిపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు.

తీర్పుతో అమరావతి రైతుల్లో హర్షాతిరేకాలు

అయితే మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన పిటిషన్ లలో కొన్ని అభ్యంతరాలు మిగిలే ఉన్నాయనీ, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ల తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. ఫిబ్రవరి నాల్గవ తేదీన ఈ పిటిషన్లపై ఇరపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసిన త్రిసభ్య ధర్మాసనం నేడు కీలక తీర్పును వెల్లడించింది. ఈ తీర్పుతో అమరావతి ప్రాంతంలోని రైతులు హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!