AP High Court: కోర్టు దిక్కార అభియోగాలపై ఇద్దరు ఏపి సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ లకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాలు దిక్కరించినందుకు గానూ సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబు, ఐపీఎస్ ద్వారకా తిరుమలరావుకు నెల రోజుల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విదిస్తూ తీర్పు ఇచ్చింది ఏపి హైకోర్టు. ఈ నెల 16వ తేదీలోగా రిజిస్ట్రార్ జ్యూడిషియల్ ముందు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. వెంటనే జైలుకు పంపాలని రిజిస్ట్రార్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు అమలు బాధ్యత ఉన్నతాధికారులదేననీ, ఉత్తర్వుల అమల్లో ఇబ్బందులు ఉంటే కోర్టుకు తెలిపి, గడువు పొడిగించాలంటూ అభ్యర్ధించాలని పేర్కొంది. వీరితో పాటు మరో ముగ్గురు ఆర్టీసీ అధికారులకు కూడా హైకోర్టు షాక్ ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని మండిపడింది.

ఆర్టీసీలో పీల్డ్ మెన్ గా పని చేస్తున్న చిత్తూరుకు చెందిన బి సురేంద్ర, మరో ముగ్గురు తమ సర్వీస్ క్రమబద్దీకరించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం..ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, వారి జీతాలకు ఏడు శాతం వడ్డీ కలిపి పిటిషనర్లకు చెల్లించాలని గత ఏడాది ఆగస్టు నెలలో ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో కోర్టు దిక్కార పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్లు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంలో అప్పీల్ పెండింగ్ లో ఉందని అర్టీసి న్యాయవాదులు వాదించారు. అప్పీల్ పై డివిజన్ బెంచ్ స్టే విధించలేదని హైకోర్టు గుర్తు చేసింది. అందుకే అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.
CM YS Jagan: హోంశాఖపై సీఎం జగన్ సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ