AP High Court: రాజధాని కేసులపై ఏపి హైకోర్టు సీజే జస్టిస్ మిశ్రా కీలక వ్యాఖ్యలు..! ఏమన్నారంటే..?

Share

AP High Court: ఏపి హైకోర్టులో రాజధాని కేసుల రోజువారీ విచారణ ప్రారంభమైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణను మొదలు పెట్టింది. ఈ సందర్భంగా సీజే మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ జరుగుతోంది. ఈ తరుణంలో త్రిసభ్య ధర్మాసనం నుండి ఇద్దరు న్యాయమూర్తులను తప్పించాలని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వ న్యాయవాది వాదనలను త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. పిటిషన్లు దాఖలు చేసిన రైతుల తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాస్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్ మిశ్రా ..రాజధాని కేసుల విచారణకు ప్రాముఖ్యం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్లు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కక్షిదారులతో పాటు అందరూ ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపిస్తోందన్నారు.

AP High Court sensational comments on ap capital cases
AP High Court sensational comments on ap capital cases

 

Read More: AP Municipal Elections 2021: కుప్పంలో దొంగ ఓట్ల కలకలం..! పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత..!!

AP High Court: సీజేల బదిలీలు..

ఏపిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చారు. దీనిపై అసెంబ్లీలో ప్రతిపాదన చేయడం, గవర్నర్ ఆమోదం తెలపడం జరిగిపోయాయి. దీంతో అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతాంగం ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. అమరావతి ప్రాంత రైతాంగం జేఏసీగా ఏర్పడి నిరసన కార్యక్రమాలను చేపట్టింది. మరో పక్క న్యాయపోరాటానికి దిగారు. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో గతంలో హైకోర్టు.. సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై స్టే ఇచ్చింది. రాజధాని అంశానికి సంబంధించి కీలకమైన అంశం కావడంతో దీనిపై రోజు వారి విచారణ చేపట్టింది జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. అయితే విచారణ చివరి దశలో ఉండగా సీజే జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో సీజేగా అరూప్ గోస్వామి వచ్చారు. ఇది కీలకమైన కేసు కావడం వల్ల మొదటి నుండి కేసు విచారణ చేపడతామని, నేరుగా ఇరుపక్షాల వాదనలు వింటామని ఆయన స్పష్టం చేస్తూ ఈ ఏడాది ఆగస్టు 23న విచారణ జరిపారు. నాడు కరోనా నేపథ్యంలో నేరుగా విచారణ జరిపే అవకాశం లేకపోవడంతో నవంబర్ 15 నుండి రోజు వారి విచారణ చేపడతామని కేసును వాయిదా వేశారు. ఈ కేసు వాయిదా అనంతరం సీజే జస్టిస్ అరూప్ గోస్వామి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బాధ్యతలు చేపట్టారు.

మూడు రాజధానుల ప్రకటన చేసిన నేపథ్యంలో జగన్ సర్కార్ అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు మొత్తం నిలుపుదల చేసింది. కోర్టు స్టే ఇచ్చిన కారణంగా అటు విశాఖలోనూ నిర్మాణాలు చేయలేకపోయింది. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. నేడు అమరావతి కేసుల రోజు వారి విచారణ చేపట్టిన సందర్భంలో త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.


Share

Related posts

తెలంగాణలో పరీక్షలు అన్నీ వాయిదా..!!

Special Bureau

Vakeel Saab : వకీల్ సాబ్ సినిమాలో అదే హైలెట్ అంట..??

sekhar

MP Raghurama krishnamraju: విజయసాయి నోరు అదుపు చేయాలంటూ సీఎం జగన్ కు రఘురామ లేఖ..

somaraju sharma