NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: అదేశాలు అమలు చేయని అధికారులకు షాక్‌ల మీద షాక్ లు ఇస్తున్న ఏపి హైకోర్టు..

AP High Court: కోర్టు ఇచ్చే ఆదేశాలు లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న అధికారులకు ఏపి హైకోర్టు ఝలక్ ఇస్తోంది. కోర్టు అదేశాలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంపై ఇటీవల సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసిన అంశం ఓ పక్క ఐఏఎస్ వర్గాల్లో కలకలాన్ని రేపుతుంది.ఇది మరువక ముందే తాజాగా విజయవాడలోని ఓ ఏసీపీకి ఏకంగా వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించడం సంచలనం సృష్టించింది.

AP High Court sensational verdicts
AP High Court sensational verdicts

Read More: AP CM YS Jagan: గ్రామ సచివాలయాల పనితీరును మరో సారి ప్రధాని మోడీకి వివరించిన సీఎం వైఎస్ జగన్..!!

ఎస్సీ, ఎస్టీ కేసులో చార్జిషీటు వేయాలని విజయవాడ ఏసీపీని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఆదేశాలను అమలు చేయకుండా తమను తప్పుదోవ పట్టించారని ఆగ్రహించిన హైకోర్టు.. ఏసీపీకి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది. అయితే ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనతో తీర్పు అమలు హైకోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది.

ఇంతకు ముందు కృష్ణాజిల్లా కలెక్టర్ గా పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఇటీవల మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యాయి. కృష్ణా కలెక్టర్ గా ఉన్న సమయంలో ఇంతియాజ్ పై వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తమకు వర్తింపజేయలేదంటూ జిల్లాలోని చందర్లపాడుకు చెందిన 20 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు గత సంవత్సరం అక్టోబర్ 22న వారికి పథకాన్ని అమలు చేయాల్సిందేనని తీర్పు ఇచ్చింది. అయితే అధికారులు 2020 -21 ఏడాదికి సంబంధించి మాత్రమే నిధులు విడుదల చేసి అంతకు ముందు ఏడాది నిధులు విడుదల చేయలేదు.

దీనిపై బాధితులు కోర్టు దిక్కరణ వ్యాజ్యం వేశారు. బుధవారం జరిగిన కోర్టు దిక్కరణ విచారణకు ఇంతియాజ్, డీఆర్డీఏ పివోలతో పాటు వారి తరపు న్యాయవాదులూ గైర్హజరుకావడంతో హైకోర్టు దీన్ని తీవ్రంగా పరిగణించి ఆ ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని తమ ముందు హజరుపర్చాలని నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో ఇదే విధంగా కోర్టు ఆదేశాలు అమలు చేయని  ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. అయితే వారి విజ్ఞప్తి మేరకు శిక్షను తగ్గించి ఓ రోజంతా కోర్టు హాలులోనే కూర్చునేలా శిక్షను మార్చింది. ఇలా కోర్టు దిక్కరణ వ్యాజ్యాల్లో అధికారులపై శిక్షలు విధిస్తుండటం అధికార వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N