ఏపి ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరో సారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన నియమితులైన వైద్యులకు వేతనాల విడుదలపై దాఖలైన పిటిషన్ పై ఏపి హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంలో హైకోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి వేతనాన్ని ఎందుకు జప్తు చేయకూడదో చెప్పాలంటూ ప్రశ్నించింది.

కరోనా సమయంలో వైద్య సేవల కోసం ప్రభుత్వం పలువురు వైద్యులను తాత్కాలిక ప్రాదిపదికన నియమించుకున్నది. అయితే వారికి ప్రతి నెలా చెల్లించాల్సిన వేతనాల్లో రెండు నెలల వేతనాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో వైద్యులు హైకోర్టు ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన హైకోర్టు .. ప్రభుత్వం, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.
సంకల్ప సిద్ధి స్కామ్ ఆరోపణలపై స్పందించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ .. ఏమన్నారంటే..?