NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Jagan: జగన్ కి మూడు నెలలు సవాళ్లే..! కష్టాలు మామూలుగా లేవు..!!

YS Jagan: రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామ, మండల స్థాయిల్లో విద్యుత్ కోతలు ఎక్కువగానే ఉన్నాయి. విద్యుత్ శాఖ సైతం చిన్న చిన్న కోతలు తప్పవని ప్రకటించడం పరిస్థితికి నిదర్శనం. వేసవి సమీపిస్తూండటంతో ప్రస్తుతం ఉన్న విద్యుత్ కోతలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం జెన్ కో ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సరిపడినంత బొగ్గు నిల్వలు లేకపోవడమేనని తెలుస్తోంది. జెన్ కో రోజువారీ నిర్వహణకే 65వేల టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం 3.2 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. జెన్ కో నిరంతరాయంగా కార్యకలాపాలు కొనసాగించాలంటే ఒక్కో ప్లాంట్ వద్ద 5 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. దీంతో బొగ్గు నిల్వలు మరో నాలుగైదు రోజులకు మించి లేకపోవడం కలవరపెడుతున్న అంశం.

ap in power problems
ap in power problems

వేసవి అవసరాలు.. 

వేసవిలో రాష్ట్రావసరాలకు విద్యుత్ డిమాండ్ 240 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయవాడ వీటీపీఎస్ లో 1.6 లక్షలు, కృష్ణపట్నంలో 1.10 లక్షలు, కడప ఆర్టీపీపీలో 50వేల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. సహజంగానే వేసవిలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఈ నిల్వలు ఏమాత్రం సరిపోనివనే చెప్పాలి. దీంతో ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి పరిస్థితిని తీసుకెళ్లడంతో సీఎం జగన్ స్పందించారు. బొగ్గు రవాణా కోసం రోజుకు కనీసం 20 రైల్వే ర్యాక్ లు కేటాయించాలని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. దీంతో రైల్వేతో జెన్ కో సంప్రదింపులు చేస్తోంది. అయితే..

నిధుల సమీకరణ..

ప్రధానంగా నిధుల సమస్య ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కో రైల్వే ర్యాక్ కు రవాణా చార్జీల కింద కోటి చెల్లించాలి. చెల్లింపు ఆలస్యమైతే 20లక్షల జరిమానాతో చెల్లించాలి. ఇప్పటికే ఈనెలలో మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి తీసుకున్న ర్యాక్ లకు 285 కోట్లు బకాయిలు ఉంది. సింగరేణి సంస్థకు 300 కోట్లు.. గతంలో మరో 300 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ చెల్లించాలని బొగ్గు సరఫరా సంస్థలు కోరుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వానికి నిధుల సమీకరణ సవాల్ గా మారింది. ప్రభుత్వం తక్షణమే ముందస్తు చర్యలకు సిద్ధం కాకపోతే వచ్చే వేసవికి విద్యుత్ కోతలు పెరిగే అవకాశం ఉంది..!

author avatar
Muraliak

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?