AP Inter Results: ఏపిలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేసి.. మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 54, సెకండ్ ఇయర్ 61 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఉత్తీర్ణత శాతంలో ఉమ్మడి కృష్ణాజిల్లా 75 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, ఉమ్మడి కడప జిల్లా 55 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడప విద్యార్ధులు ఉత్తీర్ణతా శాతంలో చాలా వెనుకబడి షాక్ ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏప్పుడూ మాదిరిగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 2,41,591 మంది పాస్ అవ్వగా, సెకండ్ ఇయర్ లో 2,58,449 మంది పాస్ అయ్యారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హజరు కాగా జవాబు పత్రాల మూల్యాకనాన్ని వేగంగా, జాగ్రత్తగా పూర్తి చేసి రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం జరిగిందని చెప్పారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కొరకు జూన్ 25వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆగస్టు 3 నుండి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇంటర్ ఫలితాలను Https://emamresults.ap.nic.in లేదా www.bie.ap.gov.in వైబ్ సైట్లలో చూసుకోవచ్చు.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…