Inter Students Alert: ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపి విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. రేపు సాయంత్రం ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ 5,19 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. మొదటి సంవత్సరానికి చెందిన 4.84 లక్షల మంది విద్యార్ధులు పరీక్షకు హజరయ్యారు.

పరీక్షా ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అంటూ విద్యార్ధినీ విద్యార్ధులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే విద్యార్ధులు టెన్షన్ కు తెర దించుతూ పరీక్షా పలితాలను విడుదల చేసే తేదీ మరియు సమయాన్ని విద్యాశాఖ ప్రకటించింది. విజయవాడలో రేపు సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను ఆన్ లైన్ లో రిలీజ్ చేయనున్నారు.
TDP BJP: మోడీతో కలిసేందుకు సిద్దమంటున్న చంద్రన్న ..! అమిత్ షా తలుపులు తెరుస్తారా..?