ఏపి మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు ప్రమాదం తప్పింది. విశాఖ బీచ్ లో పారా మోటరింగ్ కు వెళ్లేందుకు బయలుదేరగా ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది. దీంతో ఆందోళనకు గురైయ్యారు. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. విశాఖపట్నంలో జీ 20 సన్నాహక సదస్సులో మంత్రులు ఆదిమూలపు సురేష్, విడతల రజిని, గుడివాడ అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు. సదస్సులో భాగంగా విశాఖలో మారథాన్, సాహస క్రీడలు జరుగుతున్నాయి. ఆదివారం కావడంతో ఆర్కే బీచ్ లో ఉత్సాహంగా జీ 20 మారథాన్ ప్రారంభం అయ్యింది. మంత్రులు ఆదిమూలపు సురేష్, విడతల రజిని, గుడివాడ అమరనాథ్ లు మారథాన్ ప్రారంభించారు.

మారథాన్ ప్రారంభించిన మంత్రి సురేష్ ను నిర్వహకులు ఆహ్వానించడంతో పారా మోటారింగ్ రైడ్ కు బయలుదేరారు. ఈ ఈవెంట్స్ ను మంత్రి విడతల రజిని జెండా ఊపి ప్రారంభించారు. అయితే పారా మోటరింగ్ ఫస్ట్ రైడ్ కు వెళ్లేందుకు మంత్రి సురేష్ ఉత్సాహం చూపారు. అయితే విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో కదుపులకు గురైంది. నిర్వహకులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. మంత్రి సురేష్ క్షేమంగా ఉండటంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.
రెండు రాష్ట్రాల్లో స్వల్ప భూకంపాలు.. భయాందోళనకు గురైన ప్రజలు