జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రలో భాగంగా సత్తెనపల్లిలో నిర్వహించిన సభలో మంత్రి అంబటి రాంబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. తనపైన పవన్ కల్యాణ్ అవినీతి ఆరోపణలు చేశారనీ, రూ. 2 లక్షల లంచం తీసుకున్నానని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. పవన్ కల్యాణ్‌కు చాలా మందితో విడిపోవడం అలవాటేనని ఎద్దేవా చేశారు. 2019లో జగన్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావ్.. ఏమైందని ప్రశ్నించారు అంబటి. పోలవరం పూర్తి చేయకపోతే తాను మంత్రిని కాదా అని ప్రశ్నించారు.

చంద్రబాబు 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తానని చెప్పారనీ, అప్పటి ఇరిగేషన్ మంత్రిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదు అప్పుడు నువ్వు (పవన్) డబ్బులు తీసుకున్నావా అని ప్రశ్నించారు అంబటి. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంబటి విమర్శించారు. వారాహి బదులు వరహం అని పెట్టుకో.. కొంతైనా మంచి జరుగుతుందని అంబటి సెటైర్ వేశారు. రానున్న రోజుల్లో చంద్రబాబును గాడిదల మోస్తానని అంటున్నారనీ, గ్లాసుకు వేసే ఓట్లు మురిగిపోతాయన్నారు. తాను కాదు పవనే కాపుల గుండెల్లో కుంపటి, కాపుల శని పవన్ కల్యాణ్ యేనని అంబటి కౌంటర్ కామెంట్స్ చేశారు. మేము కాదు గాడిదలం! బాబుని మోసే నువ్వే పెద్ద అడ్డ గాడిదవి! అంటూ పవన్ ను ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు అంబటి.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్
