NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Minister Avanthi Srinivas: దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి అవంతి ..కేంద్రం అప్పులు చేయడం లేదా అంటూ సూటి ప్రశ్న

AP Minister Avanthi Srinivas: ఏపి ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలను కౌంటర్ ఇచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్. వైసీపీ ఇష్టానుసారం అప్పులు చేస్తోందంటూ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన కామెంట్స్ పై అవంతి శ్రీనివాస్ స్పందించారు. ఏపి అప్పుల గురించి ఆమె మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ అప్పులు చేయడం లేదా అని ప్రశ్నించారు మంత్రి అవంతి శ్రీనివాస్. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ పై మాట్లాడాలన్నారు. అదే విధంగా విభజన చట్టంలోని హామీల అమలుకై ఆమె చేస్తున్న కృషి ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని స్టీల్ ప్లాంట్ లను ప్రైవేటు పరం చేయకుండా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ నే ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తుందని ప్రశ్నించారు. ఏపి అంటే కేంద్ర ప్రభుత్వానికి అంత లోకువా అని అన్నారు మంత్రి అవంతి. స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని పార్టీలతో కలిసి పని చేస్తుమన్నామన్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ రెండు సార్లు కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఏపిపై శ్రద్ద ఉంటే కేంద్రంపై స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయవచ్చు కదా అని ప్రశ్నించారు.

AP Minister Avanthi Srinivas condemned purandeswari comments
AP Minister Avanthi Srinivas condemned purandeswari comments

Read More: Daggubati Purandeswari: వైసీపీ సర్కార్ పై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు..

AP Minister Avanthi Srinivas: టీడీపీ కుట్రలు చేసినా

విశాఖ జిల్లాలో భూసేకరణపై దాఖలైన పిల్ ను హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు మంత్రి అవంతి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణకు చర్యలు చేపట్టిందన్నారు. దీంతో విశాఖ జిల్లాలో లక్షా 84 వేల మందికి లబ్ది చేకూరుతుందని అన్నారు. అనకాపల్లి, భీమిలి, విశాఖపట్నంతో పాటు గాజువాక ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాల ద్వారా ఆర్ధికంగా బలోపేతం అవుతారని అన్నారు. 6,116 ఎకరాల్లో ఒక్కొక్కరికి 70 గజాలు ఇళ్ల స్థలం దక్కుతుందని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచనల్లో మార్పు తెచ్చుకుంటే మంచిదని హితవు పలికారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని టీడీపీ కుట్రలు చేసినా సీఎం వైఎస్ జగన్ మాత్రం అభివృద్ధిలో దూసుకువెళ్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్యానికి వైఎస్ఆర్సీపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతో పాటు నిర్మాణాలకు ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు.

AP Minister Avanthi Srinivas: కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ మూడు రాజధానుల ఏర్పాటు పెట్టే యోచన

ఇదే సందర్భంలో రాజధానుల అంశంపైనా మాట్లాడారు మంత్రి అవంతి. సాంకేతిక అడ్డంగులు అన్ని తొలగించుకుని మూడు రాజధానుల ఏర్పాటు చేయడం ఖాయమని మంత్రి అవంతి స్పష్టం చేశారు. ఒకే చోట రాజధాని ఉంటే మరో యాభై సంవత్సరాల తర్వాత అయినా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తుందని, అప్పుడు ఏమి చేస్తారని ప్రశ్నించారు. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని మంత్రి అవంతి అన్నారు. రాజధాని ఆగిపోయిందని ప్రభుత్వంపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. యాబై సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన హైదరాబాద్ ఏమయిందో మనం చూశాం కదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం మాత్రం అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి చేపట్టిన మూడు రాజధానుల కాన్సెప్ట్ ను కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అక్కడ పెట్టే యోచన చేస్తున్నాయని మంత్రి అవంతి తెలిపారు,

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk