21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజధానుల అంశంపై ఏపి మంత్రి బొత్స సంచలన కామెంట్స్

Share

ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు అమరావతి నుండి అరసవెల్లి పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే .అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ నేతలు, మంత్రులు ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఇది ఉత్తరాంధ్ర పై చేస్తున్న దండయాత్ర అంటూ వ్యాఖ్యానించడంతో పాటు వారి పాాదయాత్రను అడ్డుకుంటామంటూ కూడా పలువురు నేతలు పేర్కొన్నారు. ఈ తరుణంలో విశాఖలో మూడు రాజధానులకు అనుకూలంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన సీరియస్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

botsa satyanarayana

 

టీడీపీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెనుక ఉండి నడిపిస్తున్న పాదయాత్రగా అభివర్ణించిన మంత్రి బొత్స..ఆ పాదయాత్రను ఆపాలనుకుంటే తమకు అయిదు నిమిషాలు చాలని అన్నారు. అది ప్రజా స్వామ్య పద్దతి కాదన్న ఉద్దేశంతో ఆ పని చేయడం లేదన్నారు. వారు చేస్తున్నది రియల్ ఎస్టేట్ యాత్రా లేక రాజకీయ యాత్రా అనేది అర్ధం కావడం లేదన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే చంద్రబాబుకు, లేదా అమరావతి రైతులకు వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు బొత్స. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు త్యాగం చేశారని చెబుతున్నారనీ, అది త్యాగమేమీ కాదనీ, చట్టప్రకారమే ప్రభుత్వం భూసమీకరణ చేసిందన్నారు. భుములు ఇచ్చిన రైతులతో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను తమ ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడానికే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారని పేర్కొన్నారు.

విశాఖలో కేవలం రూ.5వేల కోట్లు ఖర్చు పెడితే ముంబాయిని తలదన్నే రాజధాని తయారు అవుతుందని అన్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా ఇటువంటి సమావేశాలు, పాదయాత్రలు చేయాలని మంత్రి బొత్స పిలుపు నిచ్చారు.మరో పక్క విశాఖలో ఏపి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ సమావేశంలో మంత్రి ఆర్కే రోజా పాల్గొని ప్రసంగించారు.ఓ పక్కఅమరావతి రైతులు మహా పాదయాత్ర చేస్తున్న తరుణంలో అమరావతి రాజధాని అనుకూల, వ్యతిరేక రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుండటం, మరో పక్క మూడు రాజధానులకు అనుకూలంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు నిర్వహణకు పూనుకోవడం ఏపిలో హాట్ టాపిక్ గా మారింది.


Share

Related posts

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ గారి తల్లికి అమ్మాయిలలో ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ చుడండి!!

Naina

బ్రేకింగ్: ఆన్లైన్ జూద క్రీడలపై నిషేధాన్ని విధించిన జగన్ సర్కార్

Vihari

బ్రేకింగ్ : ఫ్యాన్స్ ను అతి కష్టమైన కోరిక కోరిన మహేష్ బాబు..!

arun kanna