NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి ఉద్యోగులకు కీలక హామీ ఇచ్చిన మంత్రి బొత్స

సీపీఎస్ పై ఏర్పాటైన మంత్రుల కమిటీ బుధవారం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, పలు ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొనగా, ఏపీజేఏసీ అమరావతి, ఏపి సీపిఎస్ యూఎస్, ఏపి సీపీఎస్ ఈఏ సంఘాలు సమావేశాన్ని బహిష్కరించాయి. సమావేశం అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల కోసం సీపీఎస్ కంటే మెరగైన స్కీమ్ తేవాలని జీపీఎస్ ను తెచ్చామని చెప్పారు. జీపీఎస్ లో కూడా మరిన్ని సదుపాయాలు పెంచుతున్నట్లు ఉద్యోగులతో చెప్పినట్లు తెలిపారు.

AP Minister Botsa Satyanarayana About CPS

ఉద్యోగి రిటైర్ అయ్యాక కనీసం రూ.10వేల ఫించను ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స చెప్పారు. ఉద్యోగి, వారి భాగస్వామికి ప్రమాద బీమా, హెల్త్ కార్డు సదుపాయాలు కల్పిస్తామనీ, ఉద్యోగి చనిపోయినా భార్యకు పింఛను సదుపాయం ఇస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు వివరించామన్నారు. అయితే జీపీఎస్ ను అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాలు తెలియజేశాయి. ఉద్యోగ సంఘాలతో మరో సారి చర్చిస్తామనీ, సవరించిన జీపీఎస్ పై సీఎంతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామనీ, ఆ తర్వాత జీపీఎస్ కు చట్టబద్దత కల్పిస్తామని మంత్రి బొత్స తెలిపారు. సమావేశంలో ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని సంఘ నేతలు కోరారనీ, తీవ్రమైన కేసులు పెట్టిన వాటిపై రేపు సీఎం వద్ద చర్చిస్తామన్నారు.

ఉద్యోగులపై పెట్టిన కేసుల ఎత్తివేతపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని నేతలతో చెప్పినట్లు మంత్రి బొత్స వివరించారు. మరో సారి సమావేశమై ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని చెప్పిన మంత్రి బొత్స.. అయినా ఉద్యోగులు ఆందోళన చేస్తామంటే తాము ఏమీ చేయలేమని అన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల సీఎం జగన్ ఎప్పుడూ సానుకూలంగా ఉంటారని తెలిపారు. జీపీఎస్ విధానంలో కొన్ని మార్పులు చేసి అమలు చేయనున్నామని చెప్పారు. పాత పెన్షన్ విధానం ప్రభుత్వానికి భారంగా మారుతుందనీ, ఉద్యోగులు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించాలని కోరారు.

మంత్రులకు సీరియస్‌గా క్లాస్ పీకిన ఏపి సీఎం వైఎస్ జగన్..ఎందుకంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju