AP Minister Botsa: రాజకీయాల్లో ప్రస్తుతం ప్రత్యర్ధి పార్టీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పరుష పదజాలంతో దూషించడం కామన్ అయిపోయింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడును ఉద్దేశించి టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దూషణల పర్వం కొనసాగిస్తున్నారు. ఇది ఆ పార్టీ నాయకులకు రుచించడం లేదు. అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ బలపడేందుకు దువ్వాడ శ్రీనివాస్ కు ఆ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది. కాగా ఇటీవల అచ్చెన్నాయుడును ఉద్దేశించి దువ్వాడ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయి మాట్లాడారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో రీసెంట్ గా జరిగిన టెక్కలి నియోజకవర్గ వైసీపీ సమన్వయ కమిటీ సమావేశంలో దువ్వాడ ను ఉద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ చురకలు అంటించారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. టెక్కలి వైసీపీలో రెండు వర్గాలు ఉండగా ఓ వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి గైర్హజరు అవ్వడంపైనా చర్చ జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన బెట్టి దండలు వేసిన వాళ్లకే అందలం ఎక్కిస్తున్నారని పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కొందరు దువ్వాడ వ్యవహరిస్తున్న తీరుపైనా మంత్రి బొత్సకు విన్నవించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ వేదికపై నుండే కీలక సూచనలు చేశారు. వ్యవస్థకు చెడు చేసే పనులు గానీ, వ్యవస్థను కించపరిచే మాటలు గానీ, వ్యక్తులను వ్యక్తిగతంగా దూషించడం లాంటివి గానీ చేయకూడదని పరోక్షంగా దువ్వాడను ఉద్దేశించి సూచించారు. వ్యక్తుల మాట తీరుతో అతనిలోని వ్యక్తిత్వం బయటపడుతుందన్నారు. అవతలి వాడి మాటలను బట్టి వాడి వ్యక్విత్వం తెలిసిపోతుందని తన నాయనమ్మ చెప్పిందంటూ బొత్స అన్నారు. మంత్రి బొత్స సూచనలను ఎమ్మెల్సీ దువ్వాడ స్వీకరిస్తారో లేదో చూడాలి మరి.
pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్…
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…