NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP Bus Yatra: రేపటి నుండి వైసీపీ సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర … ఆడియో, వీడియోలను విడుదల చేసిన మంత్రి బొత్సా

YSRCP Bus Yatra: వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేపటి నుంచి ప్రారంభించనున్న బస్సు యాత్రను పురస్కరించుకుని “సామాజిక న్యాయ భేరి – జయహో జగనన్న” పేరుతో రూపొందించిన ఆడియో, వీడియోలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడువిడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.రేపటి నుంచి రాష్ట్రంలో సామాజిక న్యాయ భేరిని మోగిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ నేతృత్వంలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జరిగిన సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ఈ సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను చేపట్టామన్నారు రాష్ట్రంలోని బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అటు ప్రభుత్వంలోనూ, ఇటు స్థానిక సంస్థల నుంచి రాజ్యసభ వరకు రాజకీయ పదవులు, వివిధ కార్పొరేషన్ పదవుల్లో సముచిత స్థానం ఇవ్వడంలో ఆ వర్గాలకు ఏ విధంగా న్యాయం కల్పించామనే అంశాన్ని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టామని బొత్సా పేర్కొన్నారు.

AP Minister Botsa Satyanarayana Press Meet on YSRCP Bus Yatra
AP Minister Botsa Satyanarayana Press Meet on YSRCP Bus Yatra

 

గత ప్రభుత్వాల హయాంలో కేవలం 20 నుంచి 30 శాతం మాత్రమే ఈ వర్గాలకు పదవులు ఇచ్చి గొప్పగా చెప్పుకునే నేపథ్యం చూశామన్నారు మంత్రి బొత్స సత్యనాారాయణ. నేడు జగన్‌ నాయకత్వంలో మంత్రివర్గంలో 25మంది మంత్రులు ఉండగా అందులో 17మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉన్నారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 50శాతం కంటే ఎక్కువగా నామినేటెడ్‌ పదవులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లుగా ఈ వర్గాలకు జగన్ అవకాశం కల్పించారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాల వారికి సామాజిక న్యాయం ద్వారా సముచిత స్థానం కల్పించిన ఘనత వైసీపీ సర్కార్ కే దక్కుతుందన్నారు మంత్రి బొత్సా సత్యనారాయణ.

రేపు శ్రీకాకుళంలో ప్రారంభమయ్యే బస్సు యాత్ర అనంతపురంలో ముగుస్తుంది. 26న విజయనగరం, 27న రాజమండ్రి, 28న నరసరావుపేటలో, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తామని మంత్రి బొత్స చెప్పారు. ఈ బస్సు యాత్రలో 17మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ఆయా ప్రాంతాల చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్నవారంతా పాల్గొంటారని తెలిపారు. బడుగు, బలహీనవర్గాలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి బొత్సా సత్యనారాయణ విజ్ఢప్తి చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju