29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి లో హాట్ టాపిక్ గా మారిన రాజధానిపై బుగ్గన సెన్షేషనల్ కామెంట్స్ .. మళ్ళీ తూచ్ అంటారా..?

Share

ఏపి రాజధాని అంశంపై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకూ మూడు రాజధానుల ఏర్పాటే తమ ప్రభుత్వ, తమ పార్టీ విధానం అంటూ మంత్రులు చెబుతూ వచ్చారు. విశాఖ నుండి పాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం యత్నాలు ఇప్పటికే ముమ్మరం చేసింది. విశాఖకు త్వరలో షిప్ట్ అవుతాననీ, అక్కడి నుండే పరిపాలన చేస్తామని ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన కొద్ది రోజులకే మంత్రి బుగ్గన .. విశాఖనే ఏపి రాజధాని అన్నట్లు చెప్పేయడం హాట్ టాపిక్ అయ్యింది. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న బెంగళూరులో జరిగిన రోడ్ షోలో మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, గుడివాడ అమరనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపి రాజధాని అంశంపై క్లారిటీగా ప్రకటన చేశారు.

AP Minister Buggana Sensational Comments on AP Capital Issue

 

మూడు రాజధానులు అంటూ ప్రజల్లోకి మిస్ కమ్యూనికేట్ అయ్యిందన్నారు మంత్రి బుగ్గన . ఏపి పరిపాలన విశాఖ నుండే జరుగుతుందని బుగ్గన స్పష్టం చేస్తూ ఏపికి రాజధాని విశాఖ ఒక్కటే అన్న సంకేతాన్ని ఇచ్చేశారు. ఇదే క్రమంలో కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధాని అని పేర్కొనలేదు. కర్నులులో హైకోర్టు ప్రధాన బెంచ్ ఉంటుందని పేర్కొన్నారు. కర్ణాటకలోని ధార్వాడ్, గుల్బర్గాలో హైకోర్టు బెంచ్ లు ఉన్నాయనీ, అలానే ఏపిలోనూ ఉంటాయన్నారు. 1937 శ్రీ భాగ్ ఒప్పందంలో … రాజధాని ఒక చోట, హైకోర్టు మరొక చోట ఉండాలని పేర్కొన్న విషయాన్ని మంత్రి బుగ్గన ఈ సందర్భంగా గుర్తు చేసారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు బెళగాంలో ఒక సెషన్ నిర్వహిస్తున్నారనీ, అదే విధంగా అసెంబ్లీ సమావేశాలు ఒ సెషన్ గుంటూరులో జరుగుతాయని అన్నారు మంత్రి బుగ్గన. అందుబాటులో ఉన్న మౌలిక వసతుల పరంగా చూస్తే ఏపి రాజధాని విశాఖే బెస్ట్ అని.. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుండే జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వ నిర్ణయం కూడా అదే అని తెలిపారు. విశాఖ ఇప్పటికే ఓడరేవు నగరంగా, కాస్మోపాలిటన్ నగరంగా గుర్తింపు పొందిందని, భవిష్యత్తులోనూ విశాఖ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని మంత్రి బుగ్గన అన్నారు.

మరో పక్క రాజధాని అంశంపై న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తొంది. ఈ నెల 23న మూడు రాజధానుల కేసు సుప్రీం కోర్టులో విచారణకు రానున్నది. సుప్రీం కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని జగన్ సర్కార్ అంచనాలో ఉంది. ఒక వేళ విచారణ ఆలస్యం అయితే విశాఖ కేంద్రంగా సీఎం క్యాంప్ కార్యాలయం ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సమయంలో మూడు రాజధానుల వ్యవహారంపై మంత్రి బుగ్గన చేసిన కామెంట్స్ ఇటు రాజకీయ వర్గాల్లో, అటు ప్రజల్లో మరో సారి తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అయితే బుగ్గన వ్యాఖ్యలపై ఓ వేళ వ్యతిరేకత వ్యక్తం అయితే తాను అలా అనలేదనీ, మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమనీ, తన మాటలను మీడియా వక్రీకరించింది అంటూ కూడా సమర్ధించుకునే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో..!!

ఏపి లో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్ .. పర్యాటకులకు గుడ్ న్యూస్


Share

Related posts

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ప్రియ ఆంటీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!!

sekhar

బిగ్ బాస్ 4: సరికొత్త టాస్క్ లో 20 సార్లు కంటే పైగానే ఓడిపోయినా టాప్ కంటెస్టెంట్..??

sekhar

త్వరలో ఆ దేశంలో ఆకలి కేకలతో చావులు..??

sekhar