Amaravati: అమరావతి రాజధాని ప్రాంతంలో రేపు దాదాపు 51వేల మంది పేదలకు రేపు ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం పంపిణీ చేసే ఇళ్ల పట్టాలపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. పేదలు పేదలుగానే ఉండాలని, పెత్తనం తమ చేతుల్లో ఉండాలనే స్వభావం చంద్రబాబుదని అన్నారు. నయా పెత్తందార్ల కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని జోగి రమేష్ ఆరోపించారు.

పేదలకు భూములు ఇవ్వాలని ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు. హైకోర్టు నుండి సుప్రీం కోర్టు వరకూ చంద్రబాబు వెళ్లినప్పటికీ పేదలు, ప్రభుత్వ విధానమే గెలిచిందని అన్నారు మంత్రి జోగి రమేష్. రేపు 51 వేల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు వివరించారు. లబ్దిదారులందరికీ ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటే చంద్రబాబుకు అంటరానితనమా అని ప్రశ్నించారు.
చంద్రబాబు సమాధి అన్న ఆ సెంటు స్థలంలోనే టీడీపీని పేదలు సమాధి చేయనున్నారని మంత్రి జోగి అన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా చంద్రబాబు వ్యవహరించారంటూ దుయ్యబట్టారు. రేపటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు మంత్రి జోగి రమేష్.
AP Govt: గ్రూప్ – 1, 2 ఉద్యోగార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్