AP Minister Kodali nani: రేషన్ డీలర్‌లకు మంత్రి కొడాలి నాని ఊహించని షాక్..

Share

AP Minister Kodali nani: ఏపిలో రేషన్ డీలర్లు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన బాట పట్టారు. జివో నెం.10 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్నటి నుండి నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సివిల్ సప్లైస్ గోడౌన్ల (ఎంఎల్ఎస్ పాయింట్లు) వద్ద నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత మంగళవారం నుండి రేషన్ షాపులను బంద్ చేయాలని సంఘ నేతలు పిలుపు ఇచ్చినా తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకూ నవంబర్ నెల రేషన్ కోటాను దిగుమతి చేసుకోవద్దని నిర్ణయించారు. 2020 వ సంవత్సరం నాటి పీఎంజీకేవై కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాసం సర్కులర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

AP Minister Kodali nani shock to ration dealers key decision
AP Minister Kodali nani shock to ration dealers key decision

AP Minister Kodali nani: ఖాళీ సంచులకు డబ్బులు చెల్లించాలి

రేషన్ డీలర్ల నుండి ఐసీడీఎస్ కు మళ్లించిన కందిపప్పుకు సంబంధించి బకాయిలను తక్షణమే చెల్లించాలని సంఘ నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదే విధంగా ఖాళీ గొనె సంచులు తిరిగి ఇస్తే రూ.20 చెల్లించాలనే జీవోను అమలు చేయాల్సిందేనని కోరుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని సంఘ నేతలు మండాది వెంకటేశ్వరరావు తదితరులు పేర్కొన్నారు.  అయితే డీలర్ల డిమాండ్ల పై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సీరియస్ గా స్పందించారు డీలర్లు ఊహించని విధంగా షాకింగ్ కామెంట్స్ చేశారు మంత్రి కొడాలి నాని.

వాహనాలతో రేషన్ సరుకులు పంపిణీ చేస్తాం

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కొడాలి నాని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రేషన్ డీలర్లు బంద్ చేసినంత మాత్రన రేషన్ పంపిణీ ఏమీ ఆగిపోదని అన్నారు.  ఏదైనా సమస్యలు ఉండే డీలర్ల సంఘ నేతలు ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ బంద్ చేస్తామని బెదిరింపులకు దిగితే ప్రభుత్వం భయపడదన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఇంటింటి రేషన్ వాహనాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్నారు. వీటి ద్వారా కార్డుదారులకు రేషన్ సరుకులు అందిస్తామని మంత్రి నాని తెలిపారు. బైపాస్ పద్ధతిలో రేషన్ పంపిణీ చేస్తామని వెల్లడించారు. రేషన్ పంపిణీని నిలిపివేసి ప్రజలను బాధ పెట్టడం సరికాదని డీలర్లకు హితవు పలికారు. రేషన్ డీలర్ ల సమస్యలపై మంత్రి కొడాలి నాని సానుకూలంగా స్పందిస్తారని సంఘ నేతలు భావిస్తుండగా మంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో వారు ఖంగుతిన్నారు.


Share

Related posts

డేవిడ్ వార్నర్ కి థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్ హీరోయిన్..!!

sekhar

Vijaya Sai Reddy: విజయసాయికి ఒకే రోజు ఒక గుడ్, మరొక బ్యాడ్ న్యూస్‌..! అవి ఏమిటంటే..?

somaraju sharma

రెడ్ ట్రైలర్ చూసి రాం కి ఇండస్ట్రీ హిట్ పక్కా అని ఫిక్సవుతున్న ఫ్యాన్స్ ..!

GRK