AP Minister Land Scam: రూ.250 కోట్ల విలువైన భూదందాకు ఏపి మంత్రి..?

Share

AP Minister Land Scam: వైసీపీ ప్రభుత్వంలో పలువురు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో తరచు ఆరోపణలు వస్తున్నాయి. పలు చోట్ల అయితే స్వపక్షంలోని నేతలే వీటిని బయటపెడుతుండగా పలు చోట్ల ప్రతిపక్షాలకు చెందిన నాయకులు బయటపెడుతున్నారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన చేయనున్న నేపథ్యంలో తమకు పోటీలో ఉన్న ఎమ్మెల్యేకి మంత్రిపదవి రాకుండా చేయాలన్న భావనతో కూడా ఏదో ఒక ఆరోపణతో గాలి చేయాలని స్వపక్షీయులే చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా మంత్రులుగా ఉన్న వారిపైనా ఈ సమయంలో ఆరోపణలు చేస్తే ఆయనను మంత్రి పదవి నుండి తొలగిస్తారని తద్వారా తమకు అవకాశం లభిస్తుంది అనుకున్న ఎమ్మెల్యేలు ఆ దిశగానూ పావులు కదుపుతున్నారుట.

AP Minister Land Scam
AP Minister Land Scam

ఉదయభాను తనయుడిపై ఆరోపణలు

కృష్ణాజల్లాలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సీనియర్ ఎమ్మెల్యే. జిల్లాకు చెందిన మంత్రి పేర్ని నానిని మంత్రివర్గం నుండి తొలగిస్తే కాపు సామాజిక వర్గ కోటాలో సామినేని ఉదయభాను మంత్రిపదవి రేసులో ఉన్నారు. వైఎస్ హయాంలో ప్రభుత్వ విప్ గానూ సామినేని పని చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం కోదాడ వద్ద గంజాయి రవాణా చేస్తూ కొందరు పట్టుబడితే ఆ కేసులో ఉదయభాను తనయుడు ఉన్నాడంటూ ఆరోపణలను సోషల్ మీడియాలో షికారు చేయించారు. వాస్తవానికి ఆక్కడ పట్టుబడిన వ్యక్తుల్లో సామినేని ఉదయభాను తనయుడు లేకపోయినా ఓ ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేశారుట. ఆ వార్తల ఆధారంగా టీడీపీ నాయకులు ఆయనపై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను సామినేని ఉదయభాను తీవ్రంగా ఖండించారు. ఏవరో కావాలనే తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు సృష్టించారనీ, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.

Read More: Cine Politics: చక్రం తిప్పిన చిరు..!? సినీ రాజకీయంతో పవన్ ఏకాకి..!!

AP Minister Land Scam:  దేవాలయ భూములపై మంత్రి కొడాలి నాని చూపు అంటూ..

ఇప్పుడు తాజాగా కృష్ణాజిల్లాలోని ఓ మంత్రి భూదందాకు తెరలేపారంటూ ఆరోపణలు వచ్చాయి. గుడివాడ ఎమ్మెల్యే, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని రూ.250 కోట్ల దేవాలయాల భూమిని కాజేయాలని చూస్తున్నారనీ టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. గుడివాడ శివారులోని పులివర్తి – యల్లయ్యపాలెం గ్రామాల పరిధిలోని 25 ఎకరాల దేవాదాయ భూమిపై మంత్రి కన్ను పడిందనీ, సదరు భూమి ధర ఎకరా రూ.10 కోట్ల చొప్పున రూ.250 కోట్ల వరకూ ఉండవచ్చని పేర్కొన్నారు. దేవుడిమాన్యమైన 25 ఎకరాలకు ఎన్ఓసీ ఇవ్వాలంటూ దేవాదాయ శాఖ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు మాణిక్యరావు. సర్వే నెం.252 లో 15 ఎకరాలు, సర్వే నెం.294లో 5.96 ఎకరాలు, సర్వే నెం.4లో 4.83 ఎకరాలు దేవాదాయ భూమిని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిషేదిత భూముల జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. ఈ విషయంలో మంత్రి మాటలకు భయపడి అధికారులు భూమి అన్యాక్రాంతం అయ్యేందుకు సహకరిస్తే వారు ఇబ్బందులు పడతారని మాణిక్యరావు హెచ్చరించారు.


Share

Related posts

విజయ్ సాయి రెడ్డి ని అదుపులోపెట్టడం కోసం …. !! 

sekhar

దేశవ్యాప్తంగా బెస్ట్ సీఎం రేసులో ఏపీ సీఎం జగన్..!!

sekhar

కోతులకు అరటిపండ్లు పంచి మానవత్వం చాటుకున్న సీఎం కేసీఆర్

Vihari