NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Kuppam: చంద్రబాబుకు షాక్..! కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి ఆపరేషన్ స్టార్ట్స్

Kuppam: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 వైసీపీ గెలుచుకోవాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇప్పటికే పార్టీ శ్రేణులకు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. దీంతో పెద్దిరెడ్డి కుప్పంలో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇంతకు ముందే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ.. కుప్పం మున్సిపాలిటీని కైవశం చేసుకుని టీడీపీని దెబ్బకొట్టింది. కుప్పంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇది మా సత్తా అని నిరూపించుకుంది వైసీపీ.

AP Minister Peddireddy Focus on Kuppam TDP
AP Minister Peddireddy Focus on Kuppam TDP

Read More: Police Vs Police: ఏపీ ఇంటెలిజెన్స్ పోలీస్ వర్సెస్ సీఆర్పీఎఫ్ పోలీస్ – నడిమిట్ల తెలంగాణ పోలీస్

Kuppam: వంద మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి

అదే దూకుడుతో రాబోయే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ ఖాతాలో వేసుకోవాలని ఇప్పటి నుండే వ్యూహాలను సిద్దం చేస్తొంది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి.. కుప్పంలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. ఈ పర్యవసానంతో కుప్పం నియోజకవర్గానికి చెందిన వంద మంది టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. గుడిపల్లి మండలంలోని వంద మంది టీడీపీ కార్యకర్తలు తమ సభ్యత్వ కార్డులను ప్రదర్శించి మరీ వైసీపీలో చేరారు. కుప్పం వైసీపీ ఇన్ చార్జి, ఎమ్మెల్సీ భరత్ నాయకత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమక్షంలో వీరు పార్టీలో చేరారు.

 

Read More: Breaking: ఏపి ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఇద్దరు భద్రతా సిబ్బందిపై తెలంగాణలో పోలీసు కేసు నమోదు

రానున్న రోజుల్లో కుప్పం నుండి మరిన్ని చేరికలు

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మూడేళ్ల పాలన చూసిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో కూడా వైసీపీ జెండా ఎగరాలి అని స్థానికులు కోరుకుంటున్నారని అన్నారు. వైసీపీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఈ సందర్భంలో పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో కుప్పం నుండి మరిన్ని చేరికలు ఉంటాయని కూడా చెప్పారు. కుప్పంలో టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయమనీ, 2024 ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ విజయం తథ్యమనీ పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు. కుప్పంపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో టీడీపీ అధినేత  చంద్రబాబు తన ఆధిపత్యాన్ని ఏ విధంగా కాపాడుకుంటారో వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!