Cinema Tickets Issue: జగన్ సర్కార్‌కు ఎవరి మీద కోపం లేదంటూనే మంత్రి పేర్ని నాని కౌంటర్ వ్యాఖ్యలు.

Share

Cinema Tickets Issue: ఏపిలో సినిమా టికెట్ల వ్యవహారం హాట్ హాట్ నడుస్తున్న విషయం తెలిసిందే. థియేటర్ లపై అధికారుల దాడులు, థియేటర్ల మూసివేత నేపథ్యంలో సమస్య పరిష్కారానికి మంగళవారం డిస్ట్రబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అమరావతి సచివాలయంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. సుమారు గంటన్నరకుపైగా పలు విషయాలపై చర్చించారు. అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. టికెట్ల రేట్లు, థియేటర్ల మూసివేతతో పాటు గతంలో హీరోలు నాని, సిద్ధార్ధ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. టాలీవుడ్ పై తమ ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదని పేర్కొన్నారు. సినిమా టికెట్ల పై మాట్లాడే వాళ్లు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. సెప్టెంబర్ నెలలో జరిగిన డిస్ట్రిబ్యుటర్లు, ఎగ్జిబిటర్ల సమావేశంలోనే థియేటర్ల అనుమతులు, ఫైర్ ఎన్ఓసీలు తీసుకోవడం లేదని చెప్పి వాటిని రెన్యువల్ చేసుకోమని చెప్పామన్నారు. అయినా అనుమతులు లేకుండా థియేటర్లు నడిపారని అన్నారు. అనుమతులు థియేటర్లపైనే చర్యలు తీసుకున్నాము తప్ప ఇందులో ఎవరి మీదనో కక్షసాధింపు ఎందుకు ఉందని ప్రశ్నించారు.

AP Minister Perni Nani comments on Cinema Tickets Issue
AP Minister Perni Nani comments on Cinema Tickets Issue

Cinema Tickets Issue: ప్రభుత్వానికి ఏదో ఆపాదించి మాట్లాడటం ధర్మం కాదు

రాష్ట్ర వ్యాప్తంగా 130 థియేటర్ల పై చర్యలు తీసుకున్నామనీ, అవన్నీ నిబంధనలు ఉల్లంఘించినవేనని చెప్పారు. చిత్తూరు 24, కృష్ణా జిల్లాలో 12 థియేటర్లు సీజ్ చేశామనీ, లైసెన్సు రెన్యువల్ చేసుకోని 22 థియేటర్లు మూసేశారని తెలిపారు. 83 థియేటర్లను సీజ్ చేశామనీ, 23 ధియేటర్ లకు జరిమానాలు వేశామన్నారు. జివో 35 ఏప్రిల్ నెలలో ఇస్తే ఇప్పుడు ఆ జివోకు నిరసనగా మూసివేయడానికి నాని ఏ ఊరులో ఉన్నారో, ఆయన ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో తెలియదని మంత్రి నాని ఎద్దేవా చేశారు.  మరో నటుడు సిద్ధార్ద ఎక్కడ ఉంటారు, ఆయన ఉండేది చెన్నైలో, తమిళనాడు సీఎం స్టాలిన్ ఉద్దేశించి ఉండొచ్చు, అసలు సిద్ధార్ధ్ ఇక్కడ ట్యాక్స్ కట్టారా, మేం ఎంత విలాసంగా ఉంటున్నామో సిద్ధార్ధ్ చూశాడా. స్టాలిన్, మోడీ కోసమో ఆయన ఆ మాటలు అనుంటాడు అని మంత్రి నాని కౌంటర్ ఇచ్చారు. ఎవరికోసమో నిర్ణయాలు తీసుకోమనీ, ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు. హైకోర్టు సూచనలు పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. ఎవరితోనైనా ప్రభుత్వం చర్చలు జరపడానికి సిద్ధమేననీ, ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య అయినా వినడానికి తాము సిద్దమేనని చెప్పారు. ప్రభుత్వానికి ఏదో ఆపాదించి మాట్లాడటం ధర్మం కాదని మంత్రి అన్నారు. గతంలో బామ్మర్ధి తీసిన సినిమాకు రాయితీ ఇచ్చారనీ, అదే చిరంజీవి సినిమాకు రాయితీ ఇవ్వలేదనీ నాటి సీఎం చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. కానీ సీఎం జగన్ అందరినీ ఒకేలా చూస్తారని మంత్రి నాని స్పష్టం చేశారు.

డిస్ట్రిబ్యూటర్ల ప్రతిపాదనలు ఇవి

సినిమా టికెట్ ధరలపై డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు. కార్పోరేషన్ లో ఏసి థియేటర్ లలో అత్యధికంగా రూ.150లు, లోయర్ క్లాస్ రూ.50లు ఉండాలని కోరారు. ఇతర ప్రాంతాల్లో ఏసీ థియేటర్ లలో అత్యధికంగా రూ.100లు, లోయర్ క్లాస్ రూ.40లు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సినిమా టికెట్ల వ్యవహారంపై హైకోర్టు సూచనల మేరకు కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి  నాని తెలిపారు. ఈ కమిటీ సినిమా థియేటర్ల వర్గీకరణ, ధరలను నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు. సినీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశరు.

 


Share

Related posts

Coffee: కాఫీ తాగుతున్నారా..!? అయితే మీ హార్ట్ ఫెయిల్ అవ్వదు..!!

bharani jella

భారత్ లో 74 వేలకు చేరిన కరోనా కేసులు

somaraju sharma

Bigg Boss 5 Telugu: ఇద్దరు టాప్ యాంకర్ల కోసం షో నిర్వాహకులు తీవ్ర ప్రయత్నాలు..!!

sekhar