ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి మంత్రి విశ్వరూప్ కు అస్వస్థత .. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

AP Minister Pinipe Viswarup ill Health
Share

ఏపి రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దివంగత సీఎం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా అమలాపురంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి విశ్వరూప్ హజరైయ్యారు. పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఛాతి నొప్పితో అస్వస్థతకు గురై కిందపడిపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పార్టీ నేతలు ఆయనను అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మంత్రి విశ్వరూప్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు.

AP Minister Pinipe Viswarup ill Health
AP Minister Pinipe Viswarup ill Health

దివంగత సీఎం వైఎస్ఆర్ కు నేతల ఘన నివాళులు.. ఇడుపులపాయలో ఘాట్ వద్ద సీఎం జగన్, విజయమ్మ, షర్మిల

పరీక్షలు నిర్వహించిన వైద్యులు మరో రెండు రోజులు తమ పర్యవేక్షణలో ఉండాలని సూచించినట్లు తెలుస్తొంది. అయితే మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారుట. మంత్రి అస్వస్థతకు గురి కావడంతో ఆయన అనుచరులు ఆందోళనకు గురైయ్యారు. గుండె పోటు కారణంగా అస్వస్థతకు గురయ్యారా లేక ఇంకేమా కారణమా అనేది తెలుసుకునేందుకు వైద్యులు అవసరమైన పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రి విశ్వరూప్ ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం రావడంతో అభిమానులు ఊరట చెందుతున్నారు.

వేల్పుల సచివాలయ కాంప్లెక్స్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ .. ఈ ప్రాంగణం ప్రత్యేకత ఏమిటంటే..?

మంత్రి విశ్వరూప్ ఉదయం వైఎస్ వర్ధంతి కార్యక్రమాల్లో చురగ్గానే పాల్గొన్నారనీ, దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మహిళలకు చీరల పంపిణీ చేశారని నేతలు పేర్కొంటున్నారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఉండగా ఒక్క సారిగా అస్వస్థతకు గురైయ్యారని కార్యకర్తలు తెలిపారు.


Share

Related posts

TDP YSRCP: చంద్రబాబు – మంత్రి అప్పలరాజు మధ్య కేసులాట..! నేడు మళ్ళీ మంత్రిపై..!!

somaraju sharma

ఉన్న కొద్ది రాజమౌళిల మారిపోతున్న పూరి జగన్నాథ్..!!

sekhar

తెలంగాణ బిజెపి నేతలకు ఢిల్లీ పెద్దల సరికొత్త షాక్..!!

sekhar