NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందని కామెంట్స్ చేసిన మంత్రి ఆర్కే రోజా

Share

విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న సూపర్ స్టార్ రజినీకాంత్..చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. రజినీ కాంత్ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. రజినీకాంత్ తో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడించారని అన్నారు. పిల్లనిచ్చిన మామ, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర పై అసభ్యకర కార్టూన్లు వేయించి దారుణంగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. రజినీ కాంత్ కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని అన్నారు. రజినీకాంత్ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఆత్మకూడా బాధపడుతుందని అన్నారు.

AP Minister RK Roja

 

ఎన్టీఆర్ అభిమానుల బాధపడేలా రజినీ మాట్లాడారని రోజా పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు భారత్నరత్న 27 సంవత్సరాల్లో ఎందుకు ఇప్పించలేదని రోజా ప్రశ్నించారు.  ఎన్టీఆర్ ను యుగ పురుషుడు అన్న వారు ఎందుకు వెన్నుపోటు పొడిచారని ప్రశ్నించారు. చంద్రబాబుపై అలా మాట్లాడి రజినీపై తెలుగు ప్రజలకు ఉన్న గౌరవాన్ని తగ్గించుకున్నారని అన్నారు. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి కారణం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు విజన్ 2020 వల్ల టీడీపీకి 23 సీట్లకు పరిమితమైందని, ఇక విజన్ 2047 కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజినీకాంత్ కు తెలుసా అని ప్రశ్నించారు.

Rajinikanth: విజయవాడలో రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు


Share

Related posts

లైన్ లో నెక్స్ట్ ఈయనే: ఆ కమ్మ మాజీ మంత్రి మీద జగన్ పేషీలో ఫైల్ సిద్ధం?

CMR

Tea: అక్కడ ఛాయ్ ఖరీదు తెలిస్తే అమ్మో అంటారుకానీ ఒక్కసారి రుచిచూస్తే అస్సలు వదలరు!!

Naina

Guppedentha manasu Jan18 today’s episode:మహేంద్రకు గుండె నొప్పి…. శోక సంద్రంలో రిషి, జగతి… మహేంద్ర బతుకుతాడా.?

Ram