AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో భాగంగా భీమవరం (Bhimavaram) లో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ (PM Modi) పెద అమిరం వేదిక పై నుండి వర్చువల్ పధ్దతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు తెలుగు జాతి యుగ పురుషుడు అంటూ మోడీ కొనియాడారు. ఆయన పుట్టిన నేలపై మనమంతా కలుసుకోవడం అదృష్టమని అన్నారు. ఈ సందర్భంలో అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులను, అనాడు పోరాటాల్లో అల్లూరి సీతారాామరాజు వెన్నంటి ఉన్న మల్లు దొర మనువడు బోడి దొరను ప్రధాని సత్కరించారు.
స్వాతంత్ర్య సమరయోధులు పసర కృష్ణమూర్తి, అంజలక్ష్మి గార్ల కుమార్తె పసల కృష్ణభారతికి మోడీ పాదాభివందనం చేశారు. స్వాతంత్ర్య సాధనలో సమరయోధుల పోరాట పటిమ గురించి అందరికీ తెలియజేస్తూ ఆ స్పూర్తి కోసం ఆజాదీగా అమృత్ మహోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి, వీర భూమి, ఎందరో దేశ భక్తులకు పురుడు పోసిన గడ్డ ఇది అని పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, పొట్టి శ్రీరాములు, వీరేశలింగం పంతులు వంటి మహానుభావులను స్మరించారు. సభానంతరం మోడీ బయలుదేరుతుండగా ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది.
సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా ఉన్న ఆర్ కే రోజా.. ప్రధాని మోడీ తో సార్ పీజ్ సెల్ఫీ అనడంతో ఆయన నవ్వుతూ అంగీకరించారు. దీంతో రోజా తన సెల్ ఫోన్ లో మోడీ, జగన్ లతో సెల్ఫీ దిగారు. రాజకీయ నాయకురాలిగానే కాక సినిమా హీరోయిన్ గా సెలబ్రిటీ అయిన ఆర్ కే రోజాతో సెల్ఫీ దిగేందుకు వివిధ కార్యక్రమాల సమయంలో అభిమానులు పోటీ పడుతుండేవారు. అయితే నేడు రోజానే మోడీతో సెల్ఫీ దిగాలని కోరి ఆ కోరికను నెరవేర్చుకోవడం గమనార్హం. అంతకు ముందు మంత్రి రోజాను ప్రధాని మోడీకి సీఎం జగన్ పరిచయం చేశారు.
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…