Amalapuram: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన ఘటనలపై హోంమంత్రి తానేటి వనిత సమీక్ష జరిపారు. డీజీపీతో సమీక్ష అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆందోళనలు పునరావృత్తం కాకుండా అడిషనల్ డీజీ, డీఐజి, ఎస్పీ లను, అదనపు బలగాలను పంపించామని మంత్రి తెలిపారు. అమలాపురంలో ఆందోళన పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ ధైర్యంగా ఉండవచ్చని మంత్రి వనిత తెలిపారు. హింసకు పాల్పడిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. గతంలో ఏడుకు పైగా కేసులు ఉన్న వారిని 72 మందిని పోలీసులు గుర్తించారనీ, వారిలో 46 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు.
మంత్రి విశ్వరూప్ , ఎమ్మెల్యే సతీష్ నివాసాలపై దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని మంత్రి వనిత తెలిపారు. శాసన సభ్యులు, మంత్రి గారి ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారుయ జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇతర పోలీసులపై కూడా దాడి చేయడాన్ని మంత్రి ఖండించారుయ ఆందోళనకారులు దాడి చేస్తున్నప్పటికీ పోలీసులు ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటించారని ప్రశంసించారు. అమలాపురం ఘటనలో ప్రాణనష్టం జరగకుండా, ప్రజలకు, ఆందోళనకారులు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో పోలీసులు గాయపడినప్పటికి ప్రజలకు రక్షణగా ఉంటూ పరిస్థితులను అదుపు చేశారని మంత్రి తానేటి వనిత పోలీసుల తీరును అభినందించారు. సోషల్ మీడియా ద్వారా వదంతులు ప్రబలకుండా ఉండేందుకు అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…