Video Viral: ఏపిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపునకు ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జిల్లాలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. అభ్యర్ధులు ఎవరి స్థాయిలో వారు పంపిణీ లు చేస్తున్నారనే వార్తలు వినబడుతున్నాయి. పలు చోట్ల గిఫ్ట్ లు , నగదు పంపిణీ లు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈ తరుణంలో ఏపి మహిళా మంత్రి ఉషశ్రీ చరణ్ వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు డబ్బుల పంపిణీపై మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేపు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయలు పంపిణీ పై ఆమె కార్యకర్తలతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఒక గ్రామంలో 20 ఓట్లు ఉంటే రూ.20వేలు ఇవ్వండనీ, ఆ డబ్బు ఓటర్లకు చేరిందో లేదో ఫోన్ చేసి క్రాస్ చెక్ చేసుకోవాలంటూ నేతలకు మంత్రి సూచించడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
మంత్రి ఉష శ్రీ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కళ్యాణ దుర్గం నియోజకవర్గం పరిధిలోని పంచాయతీల వారీగా ఓటర్ల లిస్ట్ పరిశీలన చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి తదితరులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ కి సిద్దపడుతుండటం దుర్మార్ఘమని వారు అన్నారు. ఓటర్లకు క్షమాపణ చెప్పాలని చెప్పాలన్నారు. సీఎం జగన్ వెంటనే ఉషశ్రీని మంత్రివర్గం నుండి తప్పించాలని వారు కోరుతున్నారు.
Breaking: మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ కీలక నిర్ణయం .. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.. ఎందుకంటే..?