Subscribe for notification

Amalapuram violence: అమలాపురం విధ్వంసకర ఘటనలో మంత్రి విశ్వరూప్ సంచలన కామెంట్స్

Share

Amalapuram violence: అమలాపురం విధ్వంసకర ఘటనలో రాజకీయ కుట్ర ఉందని వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో మంత్రి విశ్వరూప్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ, జనసేన ద్వీతీయ శ్రేణి కార్యకర్తలు, రౌడీ షీటర్లు ఈ విధ్వంసంలో పాల్గొన్నారని ఆరోపణ చేసిన విశ్వరూప్ .. వైసీపీ కార్పోరేటర్ హస్తం కూడా ఉందని దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొనడం సంచలన అంశంగా మారింది. అమలాపురంలో తమ ఇంటిపై, ఎమ్మెల్యే సతీష్ ఇంటిపై దాడి చేసిన వారిలో రౌడీ షీటర్లు ఉన్నారన్నారు. ఆందోళనలో ధగ్ధం అయిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ బుధవారం పరిశీలించారు. అనంతరం మంత్రి విశ్వరూప్ మీడియాతో మాట్లాడుతూ కోనసీమలో అందరూ సంయమనం పాటింటాలని సూచించారు. కోనసీమ సాధన సమితి కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు.

ap minister vishwaroop sentational commentes on Amalapuram violence:

Amalapuram violence:  సంఘ విద్రోహ శక్తులే దారి మళ్లించి విధ్వంసం సృష్టించారు

సంఘ విద్రోహ శక్తులే దారి మళ్లించి విధ్వంసం సృష్టించారని మంత్రి పేర్కొన్నారు. సామరస్యంగా జరుగుతున్న ర్యాలీని రౌడీ షీటర్లు తన ఇఁటి వైపుు దారి మళ్లించారని అన్నారు. నిరసన కారులను కంట్రోల్ చేయడంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు విఫలమయ్యారని పేర్కొన్నారు. విధ్వంసంలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు తమ కార్యకర్తలతోనూ మాట్లాడారనీ వాటికి సంబంధించి ఆధారాలు ఉన్నాయన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా ఈ ఆందోళనలో పాల్గొనాలని వారు కోరినట్లు తమకు తెలిసిందన్నారు. నిరసనలో పాల్గొన్న వారి కాల్ డేటా సేకరిస్తున్నారని చెప్పారు. తన ఇంటికి నిప్పు పెట్టిన తరువాత నిరసన కారులు ఎమ్మెల్యే సతీష్ ఇంటివైపుకు వెళ్లారని, అక్కడి సమీపంలో టీడీపీ నేత ఆనందరావు గృహానికి వాళ్లు వెల్లలేదు అంటే ఆందోళనలో ఏ పార్టీ వారు పాల్గొన్నారో అర్ధం అవుతుందన్నారు మంత్రి విశ్వరూప్. తమ కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారన్నారు. ప్రజలు అందరూ సంయమనం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.


Share
somaraju sharma

Recent Posts

Ravi Teja: ఆ సినిమా ఔట్‌పుట్‌పై రవితేజ తీవ్ర నిరాశ.. ప్రమోషన్లకు రానని!

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…

16 mins ago

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

1 hour ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

2 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

4 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

7 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

8 hours ago