NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జనసేనపై మంత్రులు బొత్స, అంబటి, అమరనాథ్ మండిపాటు.. ఘాటు విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అసలు రాజకీయ పార్టీయే కాదు, దానికి ఒక సిద్దాంతం అంటూ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖను రాజధానిగా పవన్ ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు బొత్స. ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనకు శనివారం నాటి విశాఖ గర్జన ప్రతిరూపం గా నిలిచిందని, జోరు వర్షంలోనూ ప్రజలు గర్జనలో పాల్గొన్నారని మంత్రి తెలిపారు. విశాఖ రాజధాని వద్దనే వారికి ఇది ఓ కనువిప్పు అని పేర్కొన్నారు.

AP Ministers Botsa ambati Amarnath Slams Pawan Kalyan

టీడీపీ, జనసేన పార్టీలు కూడా తమ వైఖరి మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. జనసేనకు రాజకీయ పార్టీ లక్షణమే లేదని అన్నారు. విశాఖ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన సంఘటనను చంద్రబాబు తప్పుపట్టడంపోయి పోలీసులను తప్పు పడతారా అని ప్రశ్నించారు. మంత్రులపై దాడిని ఎందుకు తప్పుబట్టడం లేదని ప్రశ్నించారు. రాజధాని అంటే ఎయిర్ కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ ఉండాలనీ, అమరావతికి ఏ కనెక్టివిటీ అందని ప్రశ్నించారు మంత్రి బొత్స. విశాఖకు కొద్దిపాటి ఖర్చు పెడితే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని మంత్రి బొత్స పేర్కొన్నారు.

botsa satyanarayana

 

చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మూడు రోజులు కాల్ షీట్ ఇచ్చారనీ, అందులో భాగంగానే విశాఖలో అలజడి సృష్టించారని మరో మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. దేశంలోని నగరాలతో పోటీపడగల అతి పెద్ద నగరం విశాఖపట్నం అని అన్నారు. విశాఖ గర్జనకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు. చంద్రబాబు నుండి పవన్ ప్యాకేజీ తీసుకుని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులపై దాడులు చేయించారని అన్నారు. దాడులు చేస్తే అరెస్టు చేయకుండా సన్మానాలు చేయాలా, హింసు ప్రోత్సహిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని అంబటి ప్రశ్నించారు. గర్జనకు వచ్చిన ప్రజాదరణను డైవర్ట్ చేయడానికే పవన్ ప్రయత్నం చేశారని విమర్శించారు. జనసేన పేరును బాబు సేనగా మార్చుకోవాలన్నారు. హింసను ప్రేరేపించిన ఏ రాజకీయ పార్టీ బతికి బట్టగట్టిన చరిత్ర లేదని జనసేన శ్రేణులు గుర్తుంచుకోవాలని అన్నారు మంత్రి అంబటి. విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుందని మంత్రి పేర్కొన్నారు.

విశాఖ గర్జనను డైవర్ట్ చేసేందుకే పవన్ విశాఖ పర్యటన పెట్టుకున్నారని మంత్రి గుడివాడ అమరనాథ్ ధ్వజమెత్తారు. నిన్న మంత్రులపై దాడి చేసింది జనసేన కార్యకర్తలు కాదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ను పొలిటికల్ టెర్రరిస్ట్ గా అభివర్ణించిన మంత్రి అమరనాథ్ .. ఆయన ఉత్తరాంధ్ర పై కక్షకట్టారంటూ మండిపడ్డారు. జనసేన కార్యకర్తల దాడులను పవన్ సమర్ధిస్తారా అని ప్రశ్నించారు. ఆదివారం షూటింగ్ లకు సెలవు కాబట్టే పవన్ విశాఖకు వచ్చారని మంత్రి అమరనాథ్ విమర్శించారు. తమ విధానం మూడు రాజధానులైతే జనసేన విధానం మూడు పెళ్లిళ్లు అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. పెళ్లి అనేదే ఓ అడ్జస్ట్ మెంట్, పెళ్లాంతోనే అడ్జస్ట్ కాలేని పవన్ .. ప్రజలతో ఎలా అడ్జస్ట్ అవుతారని మంత్రి అమరనాథ్ ప్రశ్నించారు. లక్షా 80వేల పుస్తకాలు పవన్ చదివింది దీనికోసమేనా అని విమర్శలు గుప్పించారు.

AP Minister Gudivada Amarnath Three capitals
AP Minister Gudivada Amarnath

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!