NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దాదాపుగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ .. ఇంకా ఓటు వేయని ఒకే ఒక వైసీపీ ఎమ్మెల్యే..ఎందుకంటే..?

Share

ఏపి రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలను అదికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు వైసీపీ తన నైతిక బలంతో ఏడుగురు అభ్యర్ధులను పోటికి నిలిపింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీకి నైతికంగా 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉండగా పోటీకి బీసీ మహిళా అభ్యర్ధి పంచుమర్తి అనురాధను నిలపడంతో ఏకగ్రీవం అవుతాయనుకున్న వైసీపీ ఆశలకు నీళ్లు చల్లినట్లు అయ్యింది. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు పలువురు తమ అభ్యర్ధికి ఓటు వేస్తారన్న ధీమాతో టీడీపీ ఉంది.

 AP MLC Election
AP MLC Election

 

మరో పక్క ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారకుండా వైసీపీ వ్యూహాత్మకంగా ఒక్కో టీమ్ కు 22 మంది ఎమ్మెల్యేలతో ఏడు టీమ్ లను ఏర్పాటు చేసి మంత్రులకు ఇన్ చార్జి బాధ్యతలను అప్పగించింది. వైసీపీకి నైతికంగా 156 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, అందులో రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనం రామనారాయణరెడ్డి లు టీడీపీకి ఓటు వేశారని భావిస్తున్నారు. నేడు పోలింగ్ ప్రారంభానికి ముందు పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారనీ, వారు అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొనడంతో క్రాస్ ఓటింగ్ పై ఊహగానాలు సాగుతున్నాయి.

panchumarti Anuradha

 

మరో పక్క పోలింగ్ ముగింపు దశకు చేరుకుంది. మొదట సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆ తర్వాత మంత్రులు ఓటు హక్కు వినియోగించుకోగా, ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా వచ్చి ఓట్లు వేశారు. 11 గంటల ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ తదితర టీడీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గానూ 174 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒంటి గంట వరకూ ఒకే ఒక్క ఎమ్మెల్యే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఎవరా ఎమ్మెల్యే అంటూ చర్చ జరిగింది.

YSRCP

ఈ తరుణంలో ఆ ఒక్క ఎమ్మెల్యే ఓటు వేయకపోవడానికి కారణం ఏమిటనే దానిపై వైసీపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. విజయనగరం జిల్లాలోని నెలిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు తన కుమారుడి వివాహ వేడుకలో ఉండటంతో ఇప్పటి వరకూ రాలేదనీ, సాయంత్రం నాలుగు గంటలలోపు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలియజేశారు. వివాహ వేడుక అయిన వెంటనే ఆయన ప్రత్యేక చాపర్ లో వచ్చి ఓటు వేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాగా సాయంత్రం 5 గంటల నుండి కౌంటింగ్ నిర్వహించి ఫలితాన్ని వెల్లడించనున్నారు.

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ షాక్ ఇచ్చిన సూరత్ కోర్టు..రెండేళ్ల జైలు శిక్ష .. కానీ..


Share

Related posts

Lungs: ఊపిరితిత్తుల సమస్యలకు ఈ అద్భుతమైన చిట్కా తో చెక్ పెట్టండి..!! 

bharani jella

అక్కడ టీడీపీని తాకట్టు పెట్టేశారా..!? కుప్పంలో చంద్రబాబును ముంచిందెవరు..!?

Special Bureau

MP Raghurama: ఏపి ఉద్యోగుల కోసం రఘురామ కీలక నిర్ణయం

somaraju sharma