AP Municipal Election 2021: ఏపిలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్..! కుప్పంలో పరిస్థితి ఏమిటంటే..?

Share

AP Municipal Election 2021:  ఏపిలో నగరపాలక, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది, నెల్లూరు కార్పోరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మొత్తం 353 స్థానాల్లో 28 వార్డులు ఎకగ్రీవం కాగా 325 వార్డుల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతుంది. మొత్తం 8లక్షల 62వేల మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1,206 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నుండి ఫిర్యాదులు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత, నిఘా, పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఎస్ఈసీ నీలం సాహ్ని ఆదేశాల మేరకు గట్టి చర్యలు చేపట్టారు,

AP Municipal Election 2021 poling updates
AP Municipal Election 2021 poling updates

 

ఈ మున్సిపాలిటీల్లో ఎన్నిక

నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లా దర్శి, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లాలో బెతంచర్ల, కడప జిల్లా కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లా  పెనుగొండ మున్సిపాలిటిల్లో పోలింగ్ జరుగుతోంది.  అవసరమైన చోట మంగళవారం రీపోలింగ్ ఉంటుంది. బుధవారం ఉదయం 8గంటల నుండి ఓట్ల లెక్కించి విజేతలను ప్రకటించనున్నారు.

AP Municipal Election 2021:  కుప్పంలో విస్తృత తనిఖీ

మొత్తం 908 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేయగా 349 ప్రాంతాలను సున్నితమైనవిగా, 239 కేంద్రాలను అతి సున్నితమైనవిగా గుర్తించారు. 626 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశారు. కాగా కుప్పం మున్సిపాలిటీలో వేరే ప్రాంతాల నుండి ప్రజలను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయిస్తుందంటూ టీడీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తూ ఐడి కార్డు, ఓటరు గుర్తింపు కార్డు లేని వారిని పంపించి వేస్తున్నారు. అదే విధంగా బస్సుల్లో నుండి ప్రయాణీకులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.  కుప్పంలో వందలాది మంది బయటి ప్రాంతాల వారు మకాం వేశారని ఇప్పటికే టీడీపీ నేతలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. మరో పక్క టీడీపీ వారిపై వైసీపీ ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది


Share

Related posts

Brown Spots: ముఖంపై గోధుమరంగు మచ్చలు ఉన్నాయా..!? ఇలా చేస్తే అదృశ్యమవుతాయి..!!

bharani jella

నాడు ఉన్న పరిస్థితే చెప్పాను : లగడపాటి

somaraju sharma

కిడ్నీ లో స్టోన్స్ ఉంటే ఇలా చెయ్యండి

Kumar