NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Municipal Elections 2021: నెల్లూరు కార్పోరేషన్, 12 మున్సిపాలిటీల్లో ముగిసిన పోలింగ్..

AP Municipal Elections 2021: ఏపిలో నెల్లూరు (Nellore) కార్పోరేషన్, 12 మున్సిపాలిటీల్లో స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వకూ పోలింగ్ జరిగింది. సాయంత్రం 5గంటల వరకూ క్యూలోఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 17 కౌంటింగ్ నిర్వహించనున్నారు.

AP Municipal Elections 2021 poling updates
AP Municipal Elections 2021 poling updates

Read More: Chandra Babu: జగన్ సర్కార్‌పై ఇన్ని కుట్రలా అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..!!

AP Municipal Elections 2021:  కుప్పంలో ఉద్రిక్తతల నడుమ పోలింగ్

కుప్పంలో ఉద్రిక్తత నడుమ పోలింగ్ ముగిసింది. ఉదయం నుండి స్థానికేతరులు భారీగా తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలింగ్ జరిగింది. స్థానికేతరుల అంశం టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం, ఘర్షణలకు దారి తీశాయి. బస్సుల్లో వచ్చిన స్థానికేతరులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానికేతరులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం ఎన్నికలకు సంబంధించి టీడీపీ, వైసీపీ పరస్పరం ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాయి. టీడీపీ పై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎస్ఈసీ నీలం సాహ్నికి ఫిర్యాదు చేయగా, వైసీపీపై టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, అశోక్ బాబు తదితరులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల తీరుపై చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ నుండి ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఖండిస్తూ ప్రతి విమర్శలు చేశారు.

కాగా సాయంత్రం 5 గంటల వరకూ నెల్లూరు కార్పోరేషన్ లో 50.1 శాతం, కుప్పంలో 76.49, బుచ్చిరెడ్డిపాలెంలో 61.6 శాతం, దాచేపల్లిలో 71.88 శాతం, గురజాలలో 71.8శాతం, ఆకివీడులో 79.74, జగ్గయ్యపేటలో 78.45, పెనుకొండలో 82.63, కమలాపురంలో 76.16, కొండపల్లిలో 66,79 రాజంపేట లో 67.27 శాతం నమోదు అయ్యింది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju