NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పోలిట్రిక్స్ ..! అభ్యర్థులను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్న టీడీపీ..!!

Municipal Elections : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ వాటా కైవశం చేసుకున్న వైసీపీ YCP అదే దూకుడుతో మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు రాబట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. అధికార పార్టీ ఎత్తులకు టీడీపీ TDP బేజారెత్తిపోతుంది. మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం చేసుకునేందుకు వైసీపీ YCP పావులు కదుపుతోంది. ఏకంగా టీడీపీ TDP అభ్యర్థులే వైసీపీ YCP గూటికి చేరి పార్టీ కండువాలు కప్పేసుకుంటున్నారు.

AP Municipal Elections ycp politics
AP Municipal Elections ycp politics

చివరి నిమిషంలో అభ్యర్థులు టీడీపీ TDP ని వదిలి వైసీపీలోకి జంప్ చేస్తున్నారు. దీంతో అభ్యర్థులను కాపాడుకోవడానికి టీడీపీ TDP నానా తంటాలు పడుతోంది. సాధారణంగా ఎన్నికల తరువాత చైర్మన్ ఎన్నికల సమయంలో కౌన్సిలర్, కార్పోరేటర్‌ లను ఆయా పార్టీలు క్యాంపులకు తరలిస్తుంటాయి. కానీ ఇప్పుడే టీడీపీ TDP అభ్యర్థులను కాపాడుకునేందుకు క్యాంపుకు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం ఉపసంహరణ గడువు ముగిసే వరకూ అభ్యర్థులను కాపాడుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడింది. చిత్తూరు, అనంతపురం జిల్లాలోని టీడీపీ అభ్యర్థులను బెంగళూరు తదితర ప్రాంతాల క్యాంపులకు పంపినట్లు తెలుస్తోంది.

AP Municipal Elections ycp politics
AP Municipal Elections ycp politics

కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా రెండు వార్డుల్లో టీడీపీ అసలు నామినేషన్లు వేయలేదు. మిగిలిన 22 మంది అభ్యర్థుల్లో 18 మంది వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో 20 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులే లేనట్లైంది. శ్రీకాకుళం జిల్లా పలసాలో నలుగురు టీడీపీ అభ్యర్థులు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలోనూ టీడీపీ అభ్యర్థులు వివిధ కారణాలతో పార్టీ జంప్ అవుతున్నారు. నేటి సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి అయిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వార్డులు ఏకగ్రీవం అయ్యాయనేది స్పష్టం అవుతుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju