AP Municipal Elections: మూడు మున్సిపాలిటీలపై టీడీపీ స్పెషల్ ఫోకస్..! వైసీపీ ఓడిపోతే వారి మంత్రి పదవులకు ఎసరు..! వైసీపీ ప్రతిష్టాత్మక పోరు..!!

AP Municipal Elections: TDP Targeted for 4 Urbans
Share

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్ లోని 12 మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పోరేషన్ కు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవి అధికార వైసీపీకి చాలా ప్రతిష్టాత్మకం. ఎందుకంటే 8 నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ మినహా అన్ని చోట్ల వైసీపీనే గెలుపొందింది. తాడిపత్రిలో టీడీపీ గెలిచింది అనే కంటే జేసీ ప్రభాకరరెడ్డి కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోల్ మేనేజ్మెంట్ గానీ ఓటర్లను ఆకట్టుకోవడంలో ప్రచారంలో భిన్నంగా వెళ్లారు కాబట్టి తాడిపత్రి మున్సిపాలిటీని జేసి కుటుంబం దక్కించుకుంది. కొన్ని చోట్ల గట్టి ఫైట్ ఇచ్చినప్పటికీ టీడీపీ గెలవలేదు. ఉదాహారణకు విశాఖ జిల్లా నర్సీపట్నం, ప్రకాశం జిల్లా అద్దంకి తదితర ప్రాంతాల్లో గట్టి గా ఫైట్ చేసినా ఆ మున్సిపాలిటీలు టీడీపీకి దక్కలేదు. ఎనిమిది నెలల క్రితం కాస్త నీరసంగా ఉన్న టీడీపీ నేడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధం అయ్యింది. అభద్రతాభావం, ఆత్మనూన్యతాభావం నుండి కొద్దిగా టీడీపీ కోలుకుంది. ఎందుకంటే 2024 ఎన్నికలకు ఈ ఎన్నికలు ఓ సిమీ ఫైనల్ లాంటివిగా భావిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న 12 మున్సిపాలిటీలో ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, కుప్పం ఈ నాలుగు మున్సిపాలిటీలో టీడీపీ గెలుపు అవకాశాలను వెతుక్కొంటూ చాలా స్ట్రాంగ్ గా ఫైట్ ఇస్తోంది. వీటితో పాటు దాచేపల్లి, గురజాల లో కూడా అవకాశాలు ఉన్నట్లు టీడీపీ భావిస్తోంది. ఈ మున్సిపాలిటీలు వైసీపీకి కూడా ప్రతిష్టాత్మకం. ఎందు కంటే ఎనిమిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో క్లీన్ స్పీప్ చేసిన నేపథ్యంలో ఇప్పుడూ సత్తా చాటేందుకు వైసీపీ సిద్ధం అవుతోంది.

AP Municipal Elections ycp vs tdp
AP Municipal Elections ycp vs tdp

AP Municipal Elections: మంత్రి పదవులకు లింక్

ఈ మున్సిపల్ ఎన్నికలు కొంత మంది మంత్రి పదవులకు ముడిపడి ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మున్సిపాలిటీ ఎన్నికను చూసుకుంటే అక్కడ మంత్రి శ్రీరంగనాధరాజుకు గెలుపు బాధ్యతను అప్పగించారు. ఆయనకు సొంత సామాజికవర్గం ఉంది. అక్కడ ఆయనకు పట్టూ ఉంది. ఆయన గెలుపు బాధ్యతలను తీసుకున్నారు. ఒక వేళ ఈ మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలో పడకపోతే శ్రీరంగనాధరాజుకు పార్టీలో, ప్రభుత్వంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కాపు సామాజిక వర్గ కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కానీ జగ్గయ్యపేట మున్సిపాలిటీ లో మాత్రం టీడీపీ గట్టి ఫైట్ ఇస్తోంది. అక్కడ ఉన్న కమ్మ సామాజికవర్గ ఓటింగ్, ఆర్యవైశ్య ఓటింగ్, దళిత సామాజిక వర్గ ఓటింగ్ తమకు కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోంది. మరో వైపు మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి రావాలన్నా కనీసం ఆయన పేరు పరిశీలనలో రావాలన్న కొండపల్లి మున్సిపాలిటీ గెలుపు ఆయనకు కీలకం కానున్నది. అందుకే వీటిని ఈ నాయకలు సీరియస్ గా తీసుకున్నారు. ఇక కుప్పం మున్సిపాలిటీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత సీరియస్ గా డీల్ చేస్తున్నారో అందరికీ తెలుసు. ఆయన తన పరిధి ఉన్న అధికారాలు, పూర్తి స్థాయిలో పోలీసులు, యంత్రాంగంతో పాటు తన పరిధిలో లేని అధికారాలను వాడుతున్నారు. కుప్పం కూడా ఒక రకంగా ప్రతిష్టాత్మకం. కుప్పం వైసీపీ కోల్పోతే మంత్రిగా ఉండి కూడా  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాధించలేకపోయారన్న నామర్ధ వస్తుంది.

నెల్లూరు కార్పోరేషన్  మంత్రి అనిల్ కు ప్రతిష్టాత్మకం

వీటన్నింటికి తోడు నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నిక. అక్కడ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాస్ ఇమేజ్ కాస్త ఈ మున్సిపల్ ఎన్నికలపై ఆధారపడి ఉంది. 2014 ఎన్నికల సమయంలో అనిల్ కుమార్ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ 54 డివిజన్లలో 33 డివిజన్లు వైసీపీ కైవశం చేసుకుంది. 17 డివిజన్ల లో మాత్రమే టీడీపీ గెలిచింది. టీడీపీ గాలి ఉన్నప్పుడే వైసీపీ నెల్లూరులో తన హవా చాటింది. ఇప్పుడు నెల్లూరు మున్సిపాలిటీలో టీడీపీ గతం కంటే కొన్న డివిజన్ లు ఎక్కువగా గెలచుకున్నా అది మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మైనస్ అవుతుంది. టీడీపీకి అంత కంటే తక్కవ డివిజన్ లు గెలుచుకుంటే అనిల్ కుమార్ కు పట్టు ఉన్నట్లుగానే పార్టీ భావిస్తుంది. అందుకే అనిల్ కుమార్ 50 డివిజన్ ల వరకూ గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తండగా టీడీపీ మాత్రం కనీసం 20 డివిజన్లలో గెలుస్తామని చెబుతోంది. పైకి 20 అని చెబుతున్నా అంతర్గత సంభాషణల్లో 15, 16 డివిజన్లు మాత్రం వస్తాయని చెపుకుంటున్నారు. ఎక్కడ ఏ రిజల్ట్ వచ్చింది అనేది సీఎం జగన్మోహనరెడ్డి లెక్కలు వేసుకుని ఆ ప్రాంత ఎమ్మెల్యేలను కేబినెట్ లోకి తీసుకునే అవకాశంపై పరిశీలన చేయనున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఈ నెల 17వ తేదీన వెల్లడికానుంది.


Share

Related posts

రాజమౌళి కసితో మొదలు పెట్టాడు..ఆ రోజు తారక్ ఎంట్రీ చూడటానికి రెండుకళ్ళూ చాలవంతే ..?

GRK

అఖిలప్రియ కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు..!!

somaraju sharma

AP Minister Kodali nani: రేషన్ డీలర్‌లకు మంత్రి కొడాలి నాని ఊహించని షాక్..

somaraju sharma