ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP New Districts: ఏపిలో గెజిట్ ప్రకారం కొత్తగా ఏర్పాటైన జిల్లాలు ఇవే..

Share

AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాధమిక నోటిఫికేషన్ పై సందేహాలు, సూచనలు, అభ్యంతరాలు 30 రోజుల్లో తెలియజేయాలని కోరింది. తాజాగా విడుదల చేసిన గెజిట్ ప్రకారం ఏపిలో జిలాలు ఇవే..

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ(అమలాపురం), తూర్పు గోదావరి (రాజమహేంద్రవరం), పశ్చిమ గోదావరి (భీమవరం). ఏలూరు, మచీలీపట్నం, ఎన్టీఆర్ కృష్ణాజిల్లా (విజయవాడ), గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం(ఒంగోలు), నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాలాజీ జిల్లా (తిరుపతి), అన్నమయ్య జిల్లా (రాయచోటి), చిత్తూరు, మన్యం జిల్లా (పార్వతీపురం), అల్లూరి సీతారామరాజు (పాడేరు) జిల్లా. కొత్త జిల్లాలపై మంగళవారం రాత్రి ఆన్ లైన్ లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందు ఉంచగా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

కొత్త జిల్లాల ఏర్పాటుపై 2020 ఆగస్టున 7న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జిల్లాల సరిహద్దులు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, మౌళిక వసతులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి అంశాలపై మొత్తం నాలుగు సబ్ కమిటీలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్రాలతో ఏర్పాటైన జిల్లాలకు పాత పేర్లనే కొనసాగిస్తూ మిగతా జిల్లాల్లో కొన్నింటికి వాటి జిల్లా కేంద్రాల పేర్లతో ఏర్పాటు చేయగా కొన్నింటికి బాలాజీ, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, ఎన్టీఆర్, సత్యసాయి బాబాల పేర్లు పెట్టారు.

 


Share

Related posts

Mamillapalli Blasting Case: మామిళ్లపల్లె పేలుళ్ల కేసులో కీలక వ్యక్తి అరెస్టు… ! కడప జిల్లాలో సంచలనం..!!

somaraju sharma

Breaking : vakeel saab ట్రైలర్ వచ్చేసింది

Arun BRK

మోనాల్ పై సెటైర్ వేసిన బాబా భాస్కర్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar