ఏపి నూతన గవర్నర్ గా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే నూతన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విశేషం ఏమిటంటే.. సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హజరైయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నేతలు, అధికారులు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, సీఎం వైఎస్ జగన్ మంత్రులతో గ్రుప్ ఫోటో దిగారు.

గవర్నర్, ప్రధాన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో అధికార ప్రతిపక్ష నేతలు హజరు కావడం సర్వసాధరమే అయినప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఏపిలో లేదు. గతంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య రాజకీయ వైరం మాత్రమే ఉండేది. వ్యక్తిగత వైరంగా ఉండేది కాదు. వివిధ సందర్భాల్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకునే వారు. కానీ ప్రస్తుతం ఏపీలో అధికార, ప్రతిపక్ష నేత మధ్య ఆ పరిస్థితులు లేవు. ఒక వేళ ఇరువురు నేతలు ఒకే కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఎదురెదురుగా తారసపడకుండానే వెళ్లిపోతున్న సందర్భాలు ఉన్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో నూతన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు పాల్గొన్నారు. అంతే కాకుండా నిన్న ఉదయం సీఎం వైఎస్ జగన్ దంపతులు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా భేటీ అవ్వగా, సాయంత్రం ప్రతిపక్ష నేత నేత చంద్రబాబు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను మర్యాదపూర్వకంగ కలిసి సమావేశమైయ్యారు. ప్రస్తుత గవర్నర్ అబ్దుల్ నజీర్ రాజకీయ నేపథ్యం నుండి వచ్చిన నేత కాకపోవడం, సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కావడంతో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఆయన నియామకాన్ని స్వాగతిస్తున్నాయి.
టీడీపీ మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు .. ఎందుకంటే..?