NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP News: కరోనా వస్తే పొరుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు పరుగు..! ప్రజా ప్రతినిధులు మీరు ఏమి సందేశం ఇస్తున్నారు..!?

AP News: రాష్ట్రంలో ఆసుపత్రులను అభివృద్ధి పర్చాం, వైద్య సేవలను మెరుగుపర్చాం, కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దామని పాలకులు చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రజా ప్రతినిధులు,. అధికార పార్టీ నేతలు ప్రజలకు సూచనలు ఇస్తూ ఉంటారు. ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి డబ్బులు వృధా చేసుకోవద్దు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందాలని విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. కానీ ప్రజా ప్రతినిధులకు ఏదైనా ఆనారోగ్యం వచ్చినా, చివరకు కరోనా సోకినా వెంటనే పొరుగు రాష్ట్రాలలో వైద్య సేవలకు పరుగులు తీస్తున్నారు. అంటే మన రాష్ట్రం కంటే పొరుగు రాష్ట్రాల్లోనే వైద్య సేవలు మెరుగ్గా ఉన్నట్లు వారు భావిస్తున్నారా..?

AP News corona hospitalization other states
AP News corona hospitalization other states

Read More: Rajya Sabha: వైసీపీలో జాక్‌ పాట్ కొట్టే ఆ ముగ్గురు ఎవరంటే..?

AP News: మంగళగిరిలో ఏఐఐఎంఎస్ ఆసుపత్రి ఉన్నప్పటికీ

అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా సోకిన సమయంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లి చికిత్స పొంది వచ్చారు. చివరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా సోకిన సమయంలోనూ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. విజయవాడకు కూత వేటు దూరం మంగళగిరిలో ఏఐఐఎంఎస్ ఆసుపత్రి ఉన్నప్పటికీ విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజా ప్రతినిధులు హైదరాబాద్ కే వెళుతున్నారు. ఇక్కడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యంపై ప్రజా ప్రతినిధులకే నమ్మకం లేకపోతే ఎలా ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

ప్రజా ప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారా..?

ప్రస్తుతం పీఆర్సీ సమస్యపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులు ఆందోళన చేస్తుండటంపై డిప్యూటి సీఎం నారాయణ స్వామి స్పందిస్తూ వేలాది రూపాయలు జీతాలుగా తీసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో చదివించకుండా ప్రైవేటు, కార్పోరేట్ స్కూళ్లలో చదివిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పిల్లలు ఏమైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారా అని వాళ్లు ప్రశ్నిస్తే సదరు మంత్రి ఏమి సమాధానం చెప్పగలరు. ఎవరైనా ప్రజా ప్రతినిధులు జనాలకు చెప్పాలంటే ముందుగా వారు ఆచరించి మరొకరికి చెబితే బాగుంటుంది అని అంటున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju