NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP News: ఈ సెటైర్ వింటే నవ్వు ఆపుకోలేరు..! కరోనా ఏపీలోకి రాదట..!!

AP News: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపికి సరిహద్దుగా ఉన్న తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో పాఠశాలలకు సెలవలు పొడిగించారు. ఈ నెలాఖరు వరకు సెలవులు పొడిగించినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ప్రస్తుతం తెలంగాణ కంటే రోజు వారి కరోనా కేసుల నమోదు ఏపీలో ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా పాఠశాలలకు సెలవలు పొడిగిస్తారు అని విద్యార్థులు, వారి తల్లి దండ్రులు భావిస్తుండగా.. ప్రస్తుతానికి అటువంటి ఆలోచన లేదని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. పాఠశాలలకు సెలవలు ఇవ్వడం లేదని యాదవిధిగా సోమవారం నుండి తరగతులు కొనసాగుతాయని తెలిపారు మంత్రి సురేష్. మంత్రి సురేష్ ప్రకటనపై సోషల్ మీడియా లో నెటిజన్ ల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని పాఠశాలలకు సెలవులు పొడిగించాలని డిమాండ్ వస్తుంది.

AP News parents slams adimulapu suresh decision
AP News parents slams adimulapu suresh decision

AP News: ఏపిలోకి కరోనా రాదట..!

ఈ సందర్బంగా ఒ నెటిజన్ వ్యంగంగా చేసిన కామెంట్ చూస్తే నవ్వు ఆపుకోలేరు. ఇంతకు అతను ఏమ్మన్నాడు అంటే..? “కరోనా తెలంగాణ విద్యార్థులకు మాత్రమే వస్తుంది. అందుకే అక్కడ సెలవులు పొడిగించారు. ఏపీ బోర్డర్ చుట్టూరా ఏ రాష్ట్రం నుండి కరోనా రాకుండా వైసిపీ జండాలు కట్టేసారు” అని పేర్కొన్నాడు.

Read More: Adimulapu Suresh: ఏపిలో విద్యార్ధులకు గుడ్ న్యూస్ స్కూల్స్ సంక్రాంతి సెలవుల పొడిగింపుపై మంత్రి ఇచ్చిన క్లారిటీ ఇదీ

గత ఏడాది కూడా…

గత ఏడాది కరోనా పరిస్థితుల సమయంలోనూ పరీక్షల విషయంలో చివరి వరకు విద్యార్థుల మానసిక ఆందోళనకు గురి అయ్యారు. వివిధ రాష్ట్రాల్లో పరీక్ష లు రద్దు చేసినా.. ఏపీ పరీక్షలు నిర్వహించి తీరుతామని చివరి వరకు చెప్పి ఈ అంశం కోర్టు వరకు వెళ్లడం, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడైనా ఏకపక్షం గా నిర్ణయాలు తీసుకోకుండా కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారాలతో విద్యా శాఖ అధికారులు చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju