Subscribe for notification

ఎన్నికల సంఘానికి ఏపి ఎన్జీఓస్ జలక్..! ఎన్నికల విధులు బహిష్కరిస్తామంటూ హెచ్చరిక..!!

Share

 

రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది.

ఈ తరుణంలోనే ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఏపీ ఎన్జీఓల సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎన్నికల కమిషనర్ కు పలు దఫాలు తెలియజేశామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాసిన తర్వాత కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం అప్రజాస్వామిక మన్నారు.

బీహారు, తెలంగాణ లో ఎన్నికల తర్వాత కరోనా వ్యాప్తి చెందిందన్నారు. తక్షణం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల పెడితే ప్రజలు కరోనాతో భయ బ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్, బర్డ్ఫ్ల్యూ లాంటివి ప్రబలుతున్న కారణంగా ఎన్నికలు నిలుపుదల చేయాలని ఆయన కోరారు. ఎస్ఈసీ మొండిగా ముందుకు సాగితే న్యాయ పోరాటానికి దిగుతామని, ఎన్నికల విధులు బహిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.


Share
somaraju sharma

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

23 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

23 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

35 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

1 hour ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago