NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా

Advertisements
Share

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగింది. మరో పది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవేళ జరిగిన పంచాయతీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. ఆయా పార్టీల మద్దతుదారులను గెలిపించుకోవడం కోసం నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. మొత్తం 35 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వైసీపీ, టీడీపీ పార్టీలు నువ్వానేనా అన్న రీతిలో పోటీ పడ్డాయి. జనసేన మద్దతుదారులు కూడా పలువురు బరిలోకి దిగారు. ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్ధులు విజయం సాధించారు. సత్యసాయి జిల్లాలో ఏడు వార్డులను టీడీపీ మద్దతుదారులు, ఆరు వార్డులను వైసీపీ మద్దతు దారులు సొంతం చేసుకున్నారు.

Advertisements

Ink in elections

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఏడు వార్డులకు ఉప ఎన్నికలు జరగ్గా నాలుగు వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు, మూడు వార్డుల్లో వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం ధమ్మేన్నులో పంచాయతీ వార్డు సభ్యుడిగా టీడీపీ బలపర్చిన మట్టపర్తి అచ్చుత రామయ్య గెలిచారు. కొవ్వూరు మండలం 8వ వార్డులో జనసేన బలపర్చిన అభ్యర్ధి కొడమంచిలి నాగమణి గెలిచారు.  వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ 13వ వార్డులో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మద్దతుదారుడు బ్రహ్మానందరెడ్డి ఓటమి పాలవ్వగా, వైసీపీ సర్పంచ్ శివచంద్రారెడ్డి కుమారుడు హర్షవర్థన్ రెడ్డి 48 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ వార్డులో ఇద్దరు వైసీపీ మద్దతుదారుల మధ్య పోటీ జరిగింది.

Advertisements

AP Municipal Elections: TDP Targeted for 4 Urbans

గుంటూరు జిల్లా తెనాలి మండలం హఫ్ పేట 7వ వార్డులో టీడీపీ బలపర్చిన అభ్యర్ధి వల్లూరు శివానందం విజయం సాధించారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం సర్పంచ్ గా పరుచూరి టీడీపీ మద్దతుదారు విజయలక్ష్మి విజయం సాధించారు. వైఎస్ఆర్ జిల్లా రాజుపాలెం 9వ వార్డులో టీడీపీ మద్దతుదారు ఓబులేసు గెలిచారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం సిబ్యాల గ్రామ పంచాయతీ 12 వార్డు లో అదయ్య (టీడీపీ) గెలిచారు. నంద్యాల జిల్లా సంజామల మండలం అకుమళ్ల లో వార్డు సభ్యురాలిగా టీడీపీ బలపర్చిన అభ్యర్ధి లత విజయం సాధించారు.  అనంతపురం జిల్లా వ్యాప్తంగా 11 వార్డులు, ఒక సర్పంచ్ స్థానానికి పోలింగ్ నిర్వహించగా, అయిదు వార్డుల్లో టీడీపీ, ఆరు వార్డు వార్డుల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. గతంలో వైసీపీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ మృతితో ఖాళీ అయిన స్థానానికి తాజాగా టీడీపీ బలపర్చిన అభ్యర్ధి గెలుపొందారు.

నెల్లూరు జిల్లా రావూరు మండలం పులిగిలపాడులో టీడీపీ, జలదండి మండలం వేములపాడులో టీడీపీ, కొండాపురం మండలం సాయిపేట 3వ వార్డు టీడీపీ బలపర్చిన అభ్యర్ధులు గెలుపొందారు. చేజర్ల మండలం పాతపాడులో అయిద వార్డులో టీడీపీ, వైసీపీ మద్దతుదారులు ఇద్దరికీ సమానంగా 32 చొప్పున ఓట్లు వచ్చాయి. దీంతో రీకౌంటింగ్ నిర్వహించారు. అనంతపురం గార్లదిన్నె మండలం బూదేడు గ్రామ పంచాయతీ 9 వార్డులో వైసీపీ, యల్లనూరు మండలం బొప్పెపల్లి పంచాయతీ 3వ వార్డులో వైసీపీ, యల్లనూరు మండలం జంగంపల్లి సర్పంచ్ గా టీడీపీ బలపర్చిన అభ్యర్ధులు గెలుపొందారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు 4వ వార్డు, కొల్లూరు మండలం దోనెపూడి 5 వ వార్డు, అమర్తలూరు మండలం మాల్పురులో 2 వార్డు టీడీపీ బలపర్చిన అభ్యర్ధులు గెలుపొందారు. మూల్పురు 4వ వార్డు, వేమూరు మండలం వరాహపురం పదో వార్డు వైసీపీ బలపర్చిన అభ్యర్ధులు గెలుపొందారు. కర్లపాలెం మండలం బుద్దాం 6వ వార్డులో టీడీపీ, చుండూరు మండలం మున్నంగివారిపాలెం సర్పంచ్ గా జనసేన బలపర్చిన అభ్యర్ధులు విజయం సాధించారు.

ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట 5,11 వార్డులు, గొపన్నపాలెంలో 11 వార్డు, పోలవరం మండలం చెగొండపల్లి 6వ వార్డు టీడీపీ బలపర్చిన అభ్యర్ధులు గెలిచారు. పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీ సర్పంచ్ గా వైసీపీ బలపర్చిన మరడాని సోమేశ్వరరావు గెలిచారు. అగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామ సర్పంచ్ గా వైసీపీ బలపర్చిన వేమురాజు గెలుపొందారు. ముదినేపల్లి మండలం వణుదుర్రు సర్పంచ్ గా చినం సుగుణ బాబు  (వైసీపీ), కృష్ణాజిల్లా గూడురు మండలం పోలవరం గ్రామ 11 వార్డు (టీడీపీ), పెడన మండలం కాకర్లముడి పంచాయతీ 4వ వార్డు టీడీపీ, పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని గండిగుంట పదో వార్డు టీడీపీ బలపర్చిన అభ్యర్ధులు గెలిచారు. పల్నాడు జిల్లా ఈపురు మండలం ఉప్పరపాలెంలో 8వ వార్డు, అమరావతి మండలం యండ్రాయిలో 2వ వార్డు, నకరికల్లు మండలం గుండ్లపల్లి 5వ వార్డు, అచ్చంపేట మండలం మాదిపాడు టీడీపీ బలపర్చిన అభ్యర్ధులు విజయం సాదించారు. పెదకూరుపాడు మండలం మూసాపురం 8 వార్డు, మాచవరం మండలం పిల్లుట్ల 9 వార్డు, అమరావతి మండలం ధరణికోట 11 వార్డు లో వైసీపీ బలపర్చిన అభ్యర్ధులు గెలిచారు.

కర్నూలు జిల్లా ఆదోని మండలం బసపురం, పెద్ద తుంబలం గ్రామాల వార్డుల్లో, వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి వార్డుల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్ధులు గెలుపొందారు. విజయనగరం జిల్లా వంగర మండలం లక్ష్మీపేట పంచాయతీ సర్పంచ్ గా టీడీపీ బలపర్చిన అభ్యర్ధి గెలుపొందగా, ఒనిఅగ్రహారంలో వైసీపీ బలపర్చిన అభ్యర్ధి విజయం సాధించారు. రుసింగి పంచాయతీ 2వ వార్డులో వైసీపీ బలపర్చిన అభ్యర్ధి గెలిచారు. ఉమ్మడి పచ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా మూడు చోట్ల వైసీపీ, ఒక చోట టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం శోభాకోట సర్పంచ్ గా గా టీడీపీ బలపర్చిన అభ్యర్ధి గెలిచారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక సర్పంచ్, రెండు వార్డు స్థానాలకు పోలింగ్ జరగ్గా సర్పంచ్ స్థానాన్ని వైసీపీ, రెండు వార్డు సభ్యుల స్థానాలను టీడీపీ, వైసీపీ చెరొకటి సొంతం చేసుకున్నాయి. పోలింగ్ సర్పంచ్ గా పలు చోట్ల వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది.

తెలంగాణ బీజేపీకి షాక్ ల మీద షాక్ లు .. నష్టనివారణకు బీజేపీ యత్నం .. 27న ఖమ్మంకు అమిత్ షా


Share
Advertisements

Related posts

Gadapa gadapaku mana Prabhutvam: రేపటి నుండి గడప గడపకు మన ప్రభుత్వం

somaraju sharma

MP Komatireddy: అధికారులపై కోమటిరెడ్డికి కోపం వచ్చింది..! ఏకంగా లోక్‌సభ స్పీకర్‌కే ఫిర్యాదు చేశారు..! మేటర్ ఏమిటంటే..?

somaraju sharma

పుంఛ్ సెక్టార్‌లో పాకిస్తాన్ రేంజర్ల కాల్పులు

somaraju sharma