NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Police: సీబీఐపై రివర్స్ కేసు..! జగన్ సర్కార్ బిగ్ మిస్టేక్..!?

AP Police: రాష్ట్రంలో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సాధారణంగానే కేసులు పెడతారు. అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సహజమే. ప్రభుత్వాన్ని అస్తిరపర్చడానికి కుట్రపన్నారనీ, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనీ, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనీ రకరకాల కేసులు పెడుతున్నారు. ఇది ప్రస్తుతం జరుగుతోంది. ఇక్కడ చిత్రమైన విషయం ఏమిటంటే.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారి మీదనే ఆంధ్రప్రదేశ్ లో కేసు నమోదు అయ్యింది. ఆ కేసు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి మీద. హత్యకు గురైన వైఎస్ వివేకానంద రెడ్డి ఎవరో అనామక వ్యక్తి కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి స్వయానా బాబాయ్. ఈ కేసును సీబీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేస్తోంది. హత్య కేసులో సూత్రధారులు ఎవరు అనేదానిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. అటువంటి వాళ్లపై కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేయడం విశేషం.

AP Police case registered agonist cbi officer
AP Police case registered agonist cbi officer

AP Police: కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ లో

వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్పీ రామ్ సింగ్ పై కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. తప్పుడు సాక్షం చెప్పాలని బెదిరిస్తున్నారని అభియోగం. తప్పుడు సాక్షం చెప్పాలంటూ బెదిరిస్తున్నారనీ, నేరపూరిత బెదిరింపులకు పాల్పడారన్న ఆరోపణలపై ఐపీసీ 195 ఏ, 323, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద రామ్ సింగ్ పై కేసు నమోదు చేశారు. ఈ నెల 18వ తేదీ కడపలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు అయ్యింది. తనను సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ వేధిస్తున్నారంటూ వివేకా కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఉదయ్ కుమార్ రెడ్డి ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై అతను న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. న్యాయస్థానం నుండి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

రివర్స్ గేమ్..?

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే సీబీఐ అధికారి రామ్ సింగ్ ఏ రాష్ట్రం నుండో ఇక్కడకు కేసు విచారణ నిమిత్తం వచ్చారు. హతుడి కుటుంబీకులతో గానీ నిందితులతో గాని వీరికి ఎటువంటి సంబంధాలు లేవు. ఈ కేసులో అనుమానితులను వారు విచారిస్తారే గానీ బెదిరించాల్సిన అవసరం, భయపెట్టాల్సిన అవసరం వారికి ఏమి ఉంటుంది..? ఉదయ కుమార్ రెడ్డి చెప్పిన విషయంలో ఏమి వాస్తవం ఉందో..? న్యాయస్థానం ఏమి విచారించాయి. పోలీసులు ఎంత వరకు నిర్ధారించుకున్నారు అనేది చట్టాలు చూసుకుంటాయి. పోలీసులు చూసుకుంటారు. అయితే ఈ రామ్ సింగ్ పై కేసు నమోదు చేయడం నిందితులు వెనుక ఉన్న వారు ఆడుతున్న రివర్స్ గేమ్ గా చెప్పుకోవచ్చు. సీబీఐ మీద ఒక రకమైన వత్తిడి తీసుకురావాలన్న ఉద్దేశమూ కావచ్చు. అయితే ఈ పరిణామం సీబీఐని రెచ్చగొట్టినట్లు అవుతోంది. దీంతో వీరు అదనపు ఫోర్స్ తో దూకుడుగా వ్యవహరించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?